హెటిరో ఎండి పార్థసారథి కుమార్తె అనుమానాస్పద మృతి

కృష్ణ సింధూరి తన భర్త మాలె శ్రీనివాస్ రెడ్డి, కుమారుడు, కుమార్తెలతో కలిసి నగరంలోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి హెటిరో డ్రగ్స్‌లో మార్కెటింగ్ విభాగం డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. కృష్ణ సింధూరి ఇంట్లోని గృహిణిగా ఉంటోంది. ఆదివారం ఉదయం పడకగదిలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన భర్త శ్రీనివాస్ రెడ్డి, వెంటనే సింధూరి సోదరుడు వంశీకృష్ణకు సమాచారం అందించారు.
వారిద్దరు కలిసి వెంటనే ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే సింధూరి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే మానసికంగా కుంగిపోయిన సింధూరి, ఆత్మహత్యకు పాల్పడ్డారేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో భర్త, పిల్లలు వేరే గదిలో ఉండటం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చినట్లువుతోంది. అయితే సింధూర ఆత్మహత్య చేసుకుందా.. లేక మరేదైనా కారణమా అనే విషయాలు స్పష్టంగా తెలియడం లేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications