Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సచివాలయంలో హై అలెర్ట్.. పోలీసుల తనిఖీలు.. డేటా చోరీ జరిగిందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎన్నికల ఫలితాలలో టిడిపి కూటమి విజయం సాధించడంతో రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న తెలుగుదేశం కూటమి మెజారిటీ స్థానాలలో విజయకేతనం ఎగురవేయడంతో, ఏపీలో పాలనా పగ్గాలను చేపట్టడానికి సిద్ధమైన చంద్రబాబు నిన్ననే సీఎం ఆఫీస్ ను తన అధీనంలోకి తీసుకుని 2019 నుంచి 2024 వరకు ఉన్న ఫైల్స్ బయటకు పోకూడదని ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు
ఇక ఏపీలోనూ తెలంగాణా తరహాలో డేటా చోరీ జరుగుతుందని, తెలంగాణా తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో చేశారని డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి నేతలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తాజాగా సచివాలయంలోని ఐటి విభాగంలో నేడు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

High alert in AP secretariat police checkings at IT wing Is there any data theft

డేటా చోరీ చేయడానికి, డిలీట్ చేయడానికి ప్రయత్నాలు.. ఆరోపణలు
ఐటీ విభాగంలో ఉన్న కంప్యూటర్ల నుంచి డేటా చోరీ చేయడానికి, డిలీట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల తనిఖీలపైన ఆసక్తి నెలకొంది. అమరావతిలోని సచివాలయం నుంచి డేటా చోరీ అవుతుందా? ఐటీ వింగ్ నుండి డేటా బయటకు వెళుతుందా? అన్న చర్చలు ఏపీలో జరుగుతున్న వేళ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు.

ఐటీ వింగ్ వద్ద భారీ బందోబస్తు
డేటా బయటకు వెళ్లకుండా, అనుమానం ఉన్న చోట తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఐటీ వింగ్ ఎస్పీ నేతృత్వంలో సోదాలు చేయడంతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఫైలింగ్ ద్వారా నడుస్తున్న ఫైల్స్ అన్నింటినీ భద్రపరిచే వింగ్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఉద్యోగుల నుండి పెన్ డ్రైవ్ లు, డేటా హార్డ్ డిస్క్ ల స్వాధీనం
అధికారం మారుతున్న నేపథ్యంలో, డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో ఉద్యోగుల నుండి పెన్ డ్రైవ్ లు, డేటా హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే డేటా చోరీ జరిగిందా? లేదంటే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో చంద్రబాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ఈ-ఫైలింగ్ విధానాన్ని వ్యతిరేకించిన క్రమంలో తాజాగా ఈ విభాగంలో దాడులు కొనసాగటం ఆసక్తిని కలిగిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+