లెక్క తప్పింది: ఢిల్లీని ఎకిపారేసిన లగడపాటి, జగన్‌పైనా
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం పార్టీ అధిష్టానం, కేంద్రం పైన నిప్పులు చెరిగారు. ఎపి జర్నలిస్టు ఫోరం భేటీలో లగడపాటి మాట్లాడారు. ఓ వైపు దత్తపుత్రుడు మరోవైపు వేర్పాడువాదితో కలిసి రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తోందన్నారు. తమతో మాట్లాడకుండా, దత్తపుత్రుడు, వేర్పాటువాదులతో కలిసి ముందుకు వెళ్తుందని తాము ఊహించలేదన్నారు.
అన్ని పార్టీల్లా కాంగ్రెసు పార్టీ చేస్తుందనుకోలేదన్నారు. రాజకీయ అవసరాల కోసం మైనార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని విడదీస్తోందని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం దత్తపుత్రుడు(జగన్), వేర్పాటువాది(కెసిఆర్)తో కలుస్తారా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో అందరికీ అనుబంధముందన్నారు. ఎపి విభజనను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. 2009కి ముందు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాయని గుర్తు చేశారు.

అయితే ఇతర పార్టీల్లా కాంగ్రెసు పార్టీ నమ్ముకున్న తమలాంటి వారితో మాట్లాడకుండా ముందుకు వెళ్తుందని ఊహించలేదన్నారు. దత్తపుత్రుడితో లాలూచీపడి, చీకటి ఒప్పందాలతో నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. చూస్తుంటే మాకే తల తిరిగేలా ఉందన్నారు. సొంత వాళ్లను కాదనుకోవడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు విభజన వద్దని తాము స్పష్టంగా చెప్పామని, గతంలోను విభజనను చాలాసార్లు అడ్డుకున్నామని చెప్పారు.
విభజనకు తొలి ముద్దాయి కాంగ్రెసు పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కారణమే అన్నారు. జగన్‌తో 25, కెసిఆర్‌తో 15 సీట్లు పొందవచ్చునన్న అధిష్టానం లెక్క తప్పిందన్నారు. విభజనను తన లాంటి వాళ్లే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారన్నారు.
కేంద్రమంత్రులు, ఎంపీల ఒత్తిడితోనే విభజన ప్రక్రియలో జాప్యం అన్నారు. ముఖ్యమైన తెలంగాణ అంశాన్ని కేబినెట్లో టేబుల్ ఐటెంగా తేవడం ఏమిటన్నారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు రాదని తనకు ఇంకా నమ్మకం ఉందన్నారు. రాష్ట్రపతి ఆమోదించి సిఫార్సు చేస్తేనే విభజన సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications