జగన్ మాట మార్చారనే, కిరణ్‌ను ఢిల్లీ చూస్తోంది: జానా

ముఖ్యమంత్రి వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్టానం గమనిస్తోందని చెప్పారు. దివంగత ఇందిర గాంధీ పార్లమెంటులో బలంగా సమైక్యవాదం వినిపించారని చెబుతున్నారని కానీ, ఇందిర ఇప్పుడు ఉండి ఉంటే రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు విభజించే వారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే నిరసన తెలుపుతామని చెప్పారు.
14 పేజీల నివేదిక ఇచ్చేందుకు ఎమ్మెల్సీలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యులు శుక్రవారం భేటీ అయి మంత్రుల బృందానికి(జివోఎం)కు ఇవ్వాల్సిన నివేదిక పైన చర్చించారు. హైదరాబాదును మూడు నుండి ఐదేళ్ల పాటు మాత్రమే రాజధానిగా ఉంచాలని, అలోపు సీమాంధ్రలో రాజధానిని నిర్మించాలని, కృష్ణా నదిలోని మిగులు జలాల్లో ఎక్కువ వాటాను తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని, సింగరేణిలో నాలుగు వేల మెగావాట్లకు విద్యుత్‌ను పెంచాలని జివోఎను కోరాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీలు ఈ నివేదికను విడుదల చేశారు. 371 డి అధికరణను సవరించాలని, మండలిని కొనసాగించాలని వారు పేర్కొన్నారు. హైదరాబాదు పాలన పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిజిపిలు, సిఎస్‌లతో బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications