టిపై అధికారిక ప్రకటన ఏది: హైకోర్టు, సమ్మెకే ఎపిఎన్జీవో
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నుండి అధికారిక ప్రకటన రాలేదని, విభజన అనేది సున్నితమైన అంశమని, దానిపై ఇంకా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదని, కేంద్రం నుండి లేదా ప్రధానమంత్రి నుండి అధికారిక ప్రకటన వస్తే అది చెల్లుబాటు అవుతుందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శనివారం వ్యాఖ్యానించింది.
ఎపిఎన్జీవోల సమ్మె పిటిషన్ పైన విచారణ జరిగింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సమ్మె చాలా రోజులుగా సాగుతోందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాని లేదా కేంద్రం ప్రకటిస్తే విభజనపై అధికారికం అవుతుందని, ఇంకా అలాంటి ప్రకటన రానప్పుడు ఎలా సమ్మె చేస్తున్నారని, అధికారిక రికార్డ్ ఉంటే చూపించాలని ఆదేశించింది.

ఉద్యోగులు రాజకీయ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నారన్నది. సమ్మె ఎక్కువ కాలం మంచిది కాదని పేర్కొంది. విరమించాలని చెప్పింది. అయితే ప్రభుత్వం నుండి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు తాము సమ్మెను కోనసాగిస్తామని ఎపిఎన్జీవోల న్యాయవాది చెప్పారు.
హైకోర్టు ప్రాంగణంలో ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. సమ్మెను ముందుకు తీసుకు వెళ్తారా అని హైకోర్టు అడిగిందని, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని తమ న్యాయవాదులు కోర్టుకు తెలిపారని ఆయన అన్నారు.
తమ స్టేట్‌మెంటును ప్రధాన న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారని వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications