రాజధానిలో ఉద్రిక్తత.. జడ శ్రావణ్ కుమార్ అరెస్ట్
జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. R-5 జోన్ ను వ్యతిరేకిస్తూ ఆయన పాదయాత్ర తలపెట్టారు. 'న్యాయం కోసం నేను సైతం' పేరుతో విజయవాడ నుంచి అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతుండగానే శ్రావణ్ బస చేసిన హోటల్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల వైఖరిని శ్రావణ్‌కుమార్ ఖండించారు. అమరావతి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలీసులు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, తన అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. తనను పోలీస్ స్టేషన్ లో ఉంచినా, జైలుకు తీసుకువెళ్లినా, ఎక్కడికి వెళ్లినా తన దీక్ష మాత్రం కొనసాగుతుందని శ్రావణ్ స్పష్టం చేశారు. రైతులకు మద్దతివ్వడమే తాను చేసిన నేరమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పాదయాత్ర తలపెట్టిన శ్రావణ్ కు మద్దతుగా యాత్రలో పాల్గొనేందుకు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి అమరావతి రైతులు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో వెనకవైపు నుంచి పొలాలమీదగా వెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. అటువైపు నుంచి కూడా పోలీసులు నిలవరించే క్రమంలో పోలీసులకు, రైతుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.
శాంతి భద్రతలకు భంగం వాటిల్లనీయవద్దని తుళ్లూరు డీఎస్పీ రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 30వేల మంది లబ్ధిదారులకు సెంటు చొప్పున ఆర్-5 జోన్ లో స్థలాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన రైతుల అభ్యంతరాలను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈవారంలో విచారణ జరగనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications