కొంత మంది చనిపోయా దాకా చూస్తారా: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: విశాఖపట్నం నగరంలో కల్తీ ఆహార పదార్థాల విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు విశాఖపట్నం నగర పాలక సంస్థ, ఆహార భద్రత అధికారులను నిలదీసింది.
కొంత మంది చనిపోయేదాకా వేచి చూస్తున్నారా అని మండిపడింది. నగరంలోని పలు హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో రంగులు, రసాయనాలు కలిపి ఆహార పదార్థాలను కలుషితం చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

విశాఖ నగర పాలక సంస్థ తరఫున న్యాయవాది వివరణ ఇస్తూ - తాము తనిఖీలు చేసి 41 నమూనాలను ప్రయోగశాలకు పంపించామని, సగం యోగ్యమైనవని పరీక్షల్లో తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా కల్తీ చేసిన వ్యాపారుల లైసెన్సులను ఎందుకు రద్దు చేయలేదని హైకోర్టు జివిఎంసీని ప్రశ్నించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications