ఎక్కడో లేదు: ఫాస్ట్‌పై టీ ప్రభుత్వానికి అక్షింతలు

ఫాస్ట్ జీవో జాతీయ సమగ్రతను దెబ్బ తీసే విధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫాస్ట్ జీవో ఆమోదించదగింది కాదని అభిప్రాయపడింది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ వేర్వేరుగా ఫాస్ట్‌ను సవాల్ చేస్తూ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు.
విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. 1956ను గీటురాయిగా తీసుకుని స్థానికతను నిర్ణయిస్తూ తెలంగాణ స్థానిక విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఫాస్ట్ పథకం రాజ్యాంగ వ్యతిరేకమని డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఫాస్ట్ పథకంపై ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతూ వస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం స్థానంలో కెసిఆర్ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications