చంద్రబాబుకు కోర్టు బెయిల్ కండీషన్లు - ఆ కేసులో సీఐడీ అరెస్ట్ చేస్తుందా..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఊరట దక్కింది. స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజరు చేసింది. నాలుగు వారాల పాటు ఈ బెయిల్ అమల్లో ఉంటుంది. ఇదే సమయంలో పలు కండీషన్లను కోర్టు విధించింది. వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు కాగా, 23వ తేదీ సాయంత్రం చంద్రబాబు తిరిగి సరెండర్ కావాల్సి ఉంటుంది. అయితే, చంద్రబాబు పైన పెండింగ్ లో ఉన్న కేసుల్లో సీఐడీ ఇప్పుడు ఏం చేయబోతోందనేది కీలకంగా మారుతోంది.

మధ్యంతర బెయిల్ మంజూరు : స్కిల్ కేసులో 53 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. కంటి ఆపరేషన్ తో పాటుగా ఆరోగ్య సమస్యల కారణంగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో దాఖలైన పిటీషన్ పైన సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ రోజు దీని పైన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

High Court Grants Interim Bail for Chandra Babu with Conditions, Relief for Four Weeks

నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన బెయిల్ పిటీషన్ విచారణ నవంబర్ 10 కు కోర్టు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు కావటంతో ఈ సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లో ఇప్పుడు సీఐడీ ఏం చేయబోతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది.

వెంటాడుతున్న ఇతర కేసులు : స్కిల్ స్కాంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా..ఇతర కేసుల్లో ఉండటం ఇప్పడు చర్చకు కారణమవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీం లో పెండింగ్ లో ఉంది. తాజాగా సీఐడీ చంద్రబాబు ను లిక్కర్ కేసులో ప్రమేయం వివరిస్తూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ-3గా చేర్చారు. దీంతో, ఈ కేసులో సీఐడీ ఇప్పుడు అరెస్ట్ కు ముందుకు వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

దీంతో, ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఈ రోజు హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది. ఈ మధ్నాహ్నం ఈ పిటీషన్ విచారణకు రానుంది. ఇక, సుప్రీంలో ఉన్న క్వాష్ పిటీషన్ తీర్పు చంద్రబాబు పైన అన్ని కేసులకు కీలకంగా మారనుంది. 17ఏ ఆధారంగా క్వాష్ వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్ పైన ఇవ్వనున్న తీర్పు మొత్తంగా చంద్రబాబు కేసులు ఆధారపడి ఉన్నాయి.

High Court Grants Interim Bail for Chandra Babu with Conditions, Relief for Four Weeks

సుప్రీం తీర్పు కీలకంగా : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు పలు కండీషన్లను స్పష్టం చేసింది. చంద్రబాబుకు కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ కోసం ఈ మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు బెయిల్ మీద ఉన్న సమయంలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు.

ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. చంద్రబాబుకు ఇద్దరు డీఎస్పీలో ఎస్కార్ట్ ఉంచాలనే ప్రభుత్వ అభ్యర్దన పైన కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. జెడ్ సెక్యూరిటీ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక, చంద్రబాబు కేసులు..అరెస్ట్..విచారణలో చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+