చంద్రబాబు కు బిగ్ రిలీఫ్ - హైకోర్టు మధ్యంతర బెయిల్..!!

చంద్రబాబుకు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీని పైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబు కు బెయిల్ లభించింది.

ఇరుపక్షాల వాదనలు:చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని ఈ రోజుకు (మంగళవారం) వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.అనుబంధ పిటిషన్‌పై వెల్లడించే నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. స్కిల్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

High Court Grants Interim Bail for TDP Chief Chandra Babu in Skill Scam on medical Grounds

తర్వాత ఆనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. సీఐడీ తరఫున ప్రత్యేక ప్రబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వివేకానంద స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను న్యాయస్థానం ముందు ఉంచామని తెలిపారు. టీడీపీ అధినేత తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

చంద్రబాబు బాధ్యుడు కాదు:వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యల్లో భాగంగానే చంద్రబాబును స్కిల్‌ కేసులో నిందితుడిగా చేర్చిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. 17ఏ విషయంలో వాదనలు మగియడంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు.స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేసన్‌ ఏర్పాటు చంద్రబాబు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. దానికి కేబినెట్‌ ఆమోదం ఉందన్నారు.

ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం, సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. డిజైన్‌ టెక్‌ సంస్థకు ఎక్వి్‌పమెంట్‌ సమకూర్చిన స్కిలర్‌ సంస్థ ఫేక్‌ ఇన్వాయిస్ లు సృష్టించిందనే కారణం చూపి అందుకు చంద్రబాబును బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు. చంద్రబాబు గత 52 రోజులుగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని కోర్టుకు వివరించారు.

High Court Grants Interim Bail for TDP Chief Chandra Babu in Skill Scam on medical Grounds

మధ్యంతర బెయిల్ కోరుతూ:చంద్రబాబు దాదాపు 5 కేజీల బరువు తగ్గారని, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉందని చెప్పారు. పలు వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వ డాక్టర్లు సిఫారసు చేశారని వివరించారు.అత్యవసరంగా కంటికి శస్త్రచికిత్స చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఎడమ కంటికి శుక్లం శస్త్ర చికిత్స నిర్వహించారని వెల్లడించారు. మూడునెలల్లో కుడి కంటికీ చేస్తామని వైద్యులు నివేదిక ఇచ్చారననారు.

ప్రస్తుతం కుడి కన్ను చూపు మందగించిందని...అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించాలని కోర్టుకు నివేదించారు. తనకు నచ్చిన డాక్టర్‌ వద్ద వైద్యం చేయించుకునే హక్కు చంద్రబాబుకు ఉందని వాదనల్లో పేర్కొన్నారు. సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీని పైన ఈ రోజన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ..తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+