వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్-హైకోర్టు కీలక ఆదేశాలు..!!
వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్. మాచవరం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో కొంత కాలంగా వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంశీ పైన ఉన్న కేసుల్లో అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారు. తరువాత బెయిల్ పైన బయటకు వచ్చారు. కాగా, కిందటి నెలలో మాచవరం పోలీసు స్టేషన్ లో వంశీ పైన మరో కేసు నమోదైంది. కాగా.. ఇప్పుడు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వల్లభనేని వంశీకి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ డిసెంబరు 17న విజయవాడ మాచవరం స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. వంశీతొ పాటు మరి కొందరి పేర్లను పోలీసులు నిందితులుగా నమోదు చేశారు. గత ఏడాది జూన్ 7న సునీల్‌పై దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన అనుచరులు సునీల్‌పై దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవల వల్లభనేని వంశీ ఇంటికి వెళ్లిన పోలీసులు సమన్లు ఇచ్చేందుకు ఇవ్వాలనుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. వంశీ అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది. కాగా, అటె ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు.

పిటీషన్ లో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ వంశీ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా విచారణ చేయాలని అభ్యర్థించారు. అయితే, పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదై న కేసు వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. వంశీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ విచారణ చేస్తుంది అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వంశీ ఫోన్ కూడా స్విచాఫ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వంశీకి రిలీఫ్ దక్కనుంది.












Click it and Unblock the Notifications