పుష్కరాలకు ప్రభుత్వ సొమ్ము, హైకోర్టులో పిల్: దవళేశ్వరం ఘటనపై సుమోటోగా
హైదరాబాద్/రాజమండ్రి: గోదావరి పుష్కరాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ మతానికి సంబంధించిన కార్యక్రమానికి అనుకూలంగా ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేయడంపై ఏపిసిఎస్సీ న్యాయవాది రఘునాథ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిల్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశముంది.
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
గవర్నర్ నరసింహన్ దంపతులు రాజమండ్రి, భద్రాచలం పుష్కర ఘాట్‌లలో పుష్కర స్నానం ఆచరించారు. తొలుత రాజమండ్రిలో, ఆ తర్వాత భద్రాచలం వద్ద ఆయన పుష్కర స్నానం ఆచరించారు. రాజమండ్రి నుండి హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతె గ్రామానికి వచ్చిన గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు.

దవళేశ్వరం ఘటనను సుమోటోగా
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత జూన్ నెలలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై వారంలోగా నివేదిక అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. జూన్ నెలలో ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి తుఫాన్ వాహనం నదిలోకి బోల్తా పడిన ఘటనలో విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన 22 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే వంశానికి చెందినవారు. ఒక బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.












Click it and Unblock the Notifications