ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు: స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు, మూడు వారాల గడువు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఆళ్ల తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మంగళవారం వాదనలు వినిపించారు. నలుగురు మంత్రులు సహా 19మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలోనే స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఫిర్యాదు చేసినా.. స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

high court notices speaker defection mlas case

వాదనలు విన్న న్యాయస్థానం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా.. స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్ నిర్ధిష్ట సమయంలో స్పందించాల్సి ఉందన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. 24మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు నోటిసులివ్వాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court notices to Andhra Pradesh Assembly Speaker Kodela Shiva Prasada Rao on defection mlas case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X