హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్, ఆ రాజధాని భూముల్లో వ్యవసాయం
హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీ పోస్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆ పోస్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి నియామకాల పైన తప్పకుండా అనుమతి తీసుకోవాలని చెప్పింది.
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని కోర్టు చెప్పింది. కాగా, పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది.
పోలవరం పనులపై...

పోలవరం పనుల పైన సోమా సీజీజీ సంస్థ దరఖాస్తును హైకోర్టు కొట్టివేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌కు పనుల అప్పగింత పైన సోమా సీజీజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఆ భూముల్లో వ్యవసాయం: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన 300 మంది రైతులకు ఊరట లభించింది. ఆ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. అయితే ఆ భూములను ఇతరులకు బదలాయించవద్దని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications