తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి రైతులకు రిలీఫ్ - హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : కండీషన్స్ అప్లై..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అమరావతి రైతులకు రిలీఫ్ దక్కింది. తాము న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేస్తున్న పాదయాత్రకు గొప్ప ముగింపు ఇవ్వాలని భావించారు. ఇందు కోసం ఇప్పటికే తిరుపతి చేరుకున్న అమరావతి జేఏసీ నేతలు- రైతుల ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయించారు. అయితే ,హైకోర్టు పాదయాత్రకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, సభకు అనుమతి ఇవ్వలేదంటూ పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. దీంతో..అమరావతి జేఏసీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన విచారణ చేసిన న్యాయస్థానం తిరుపతి బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

17న అమరావతి రైతుల బహిరంగ సభ

17న అమరావతి రైతుల బహిరంగ సభ

అమరావతిలో నవంబర్ 1వ తేదీన జేఏసీ నేతలు పాదయాత్ర ప్రారంభించారు. గుంటూరు..ప్రకాశం..నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతి చేరారు. ఈ రోజు - రేపు అమరావతి రైతులకు టీటీడీ అధికారులు శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించారు. ఇక, ఈ నెల 17వ తేదీకి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు ప్రకటించి రెండేళ్లు పూర్తవుతుంది. దీంతో..తిరుపతి నుంచి బహిరంగ సభ నిర్వహించి..అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ నేతలు పిలుపునివ్వనున్నారు.

హైకోర్టు అనుమతి..కండీషన్స్ వర్తింపు

హైకోర్టు అనుమతి..కండీషన్స్ వర్తింపు

మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా జేఏసీ బహిరంగ సభకు అనుమతించాలని కోర్టును లాయర్లు కోరారు. తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటల నుండి 6 వరకు సభకు అనుమతి ఇస్తూ హైకోర్టు స్పష్టం చేసింది. లా&ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందన్న ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని.. వీడియో ఫుటేజ్ ను కోర్టుకు చూపించారు.

మూడు రాజధానుల ప్రకటనకు రెండేళ్లు

మూడు రాజధానుల ప్రకటనకు రెండేళ్లు

ప్రవేట్ ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని కోర్టు ప్రశ్నించింది. ఇటీవల కురిసిన భారీ వర్షల కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఏఏజీ నివేదించారు. ఒమిక్రాన్ కేసుల ఉన్న నేపధ్యంలో సభకు అనుమతిచలేదన్న అడిషనల్ ఏజీ చెప్పుకొచ్చారు. బహిరంగ సభలో ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్న హైకోర్టు..నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం ,ప్రభుత్వం అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయావద్దంటూ హైకోర్టు అమరావతి జేఏసీ నేతలను నిర్దేశించింది.

English summary
High court permitted Amaravati JAC to conduct public meeting in Tirupati, with conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X