చంద్రబాబు బెయిల్ వాయిదా - కస్టడీపై తీర్పు, క్షణం క్షణం..!!

చంద్రబాబు రిమాండ్ రేపటితో ముగియనుంది. ఇక, చంద్రబాబు(Chandra Babu) బయటకు వస్తారా.. కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా. అటు చంద్రబాబు అంగళ్లు కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబును అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ పైన ఈ సాయంత్రి ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పు ఇవ్వనుంది. దీంతో, అసలు చంద్రబాబు కేసులు..బెయిల్ వ్యవహారంలో ఉత్కంఠ పెరుగుతోంది.

బెయిల్ విచారణ వాయిదా : చంద్రబాబు కేసులు..బెయిల్ పిటీషన్లు..కోర్టు నిర్ణయాలతో టీడీపీ(TDP) శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది. చంద్రబాబు కోసం ఇటు ఏసీబీ కోర్టులో సీఐడీ వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేస్తుంటే..అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు చంద్రబాబు పైన నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. తాజాగా అమరావతి రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇటు అంగల్లు అల్లర్ల ఘటనలో చంద్రబాబు బెయిల్(Chandra Babu Bail) పిటిషన్ ఎల్లుండికి వాయిదా వేసారు. అటు క్వాష్ పిటీషన్ పైన వాదనలు పూర్తి కావటంతో తీర్పు రిజర్వ్ అయింది. ఇక, ఏసీబీ కోర్టు ఈ సాయంత్రం చంద్రబాబు (Chandra Babu)కస్టడీ పిటీషన్ పైన తీర్పు వెలువరించనుంది.

High court posted Chandra Babu Bail petition for 26th Sep, judgement today in Custody petition

కస్టడీ పిటీషన్ పై నేడే తీర్పు : స్కిల్ స్కాంలో విచారణలో చంద్రబాబును అయిదు రోజులు కస్టీడీకి ఇవ్వాలని సీఐడీ(CID) కోరింది. కేసులో అవినీతి జరిగినట్లు నిర్దారణ అయిందని..చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సీఐడీ వాదించింది. రూ 371 కోట్ల దుర్వినియోగం జరిగిందని కోర్టు ముందు పేర్కొంది. ఆన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కర్నీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడమే అసలు ఉద్దేశమన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజీ వాదనలు వినిపించారు. చంద్రబాబును విచారించటం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

పెరుగుతున్న ఉత్కంఠ : ఈ వాదనలతో చంద్రబాబు న్యాయవాది లూధ్ర(Ludhra) విభేదించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. ఆయన అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు లూథ్రా. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని.. సీఐడీ విచారణలో కొత్త కోణం ఇప్పటిదాకా ప్రవేశ పెట్టలేక పోయారని లూథ్రా వాదనలు వినిపించారు. 12 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు రిమాండ్ (Chanra Babu Remand) 22తో పూర్తి కానుంది. ఈ సమయంలో ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+