ఉమ్మడి ఏపీలో గెలిచారు, సీఎంగా చంద్రబాబు ఉండొద్దని పిటిషన్: హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లోని నిబంధనల ప్రకారం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగడానికి వీల్లేదని దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లోని నిబంధనల ప్రకారం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగడానికి వీల్లేదని దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.

ఉమ్మడి ఏపీలో గెలిచిన ఎన్నికల్లో సిఎం అయ్యారని
చంద్రబాబు సీఎంగా కొనసాగడానికి వీల్లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయలేదని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
Recommended Video


అపాయింటెడ్ డే తర్వాత ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (అపాయింటెడ్ డే) తర్వాత చంద్రబాబు చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ సమ్మతం కాదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు ఆగ్రహం
ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టి మూడేళ్లు పూర్తయ్యే వరకు పిటిషనర్ ఏం చేస్తున్నారని నిలదీసింది.

దుర్వినియోగం చేయడమే
ఈ దశలో కోర్టును ఆశ్రయించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ సమ్మతం కాదనడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆదేశాలు
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ టి రజనిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications