హైడ్రామా: ట్రావెల్స్ ను రద్దు చేసుకొనేందుకు సిద్దమైన కేశినేని, చంద్రబాబు ఫోన్ తో ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆర్ టీ ఏ కార్యాలయం వద్ద గొడవ విషయమై టిడిపి ఎంపీ కేశినాని నాని అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన తనకున్న ట్రావెల్స్ ను రద్దు చేసుకొనేందుకు సిద్దమయ్యారు.అయితే ఎపి సిఎం చంద్రబాబునాయుడు నుండి ఫోన్ రావడంతో ఆయన ప్రెస్ మీట్ ను రద్దుచేసుకొన్నారు.అయితే తన నిర్ణయంలో మార్పు ఉండదని ఆయన చెబుతున్నారు.

ఆర్ టీ ఏ కార్యాలయంలో విజయవాడ ఎంపి కేశినాని నాని , టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు లు వ్యవహరించిన తీరు పట్ల అసెంబ్లీలో వైసీపి, టిడిపి సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.

అయితే ఇదే సమయంలో ఈ ఘటనలో రవాణాశాఖ కమిషనర్ ను కలిసి టిడిపి ఎంపి కేశినాని , ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావులు క్షమాపణ చెప్పారు. ఈ వివాదం సమసిపోయినట్టేనని భావించారు.

high drama at Vijayawada mp kesineni nani office

అయితే రవాణశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంను కలసి క్షమాపణ చెప్పిన ఘటన పట్ల మనస్థాపానికి గురయ్యారు.అయితే ఇదే విషయమై శుక్రవారం నాడు నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తన కార్యాలయం వద్ద బస్సుల పర్మిట్లను రద్దు చేసుకొంటానని ప్రకటన చేయాలని భావించారు.అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నానికి ఫోన్ వచ్చింది. తక్షణమే సిఎంను కలవాలని సూచించారు.

అయితే దీంతో ఆయన తన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకొన్నారు. బస్సుల పర్మిట్లను రద్దు చేసుకొంటానని ప్రకటన చేయకూడదంటూ సిఎంఓ నుండి నానికి సలహఇచ్చారు.అయితే ఈ తరుణంలో నాని ప్రెస్ మీట్ ను రద్దు చేసుకొన్నారు.అయితే అదే సమయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెబుతున్నారు.దీంతో నాని కార్యాలయం వద్ద హైడ్రామా కొనసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
high drama at Vijayawada mp kesineni nani office.nani dissatisfied about rta office incident,when cmo phoned to kesineni nani on friday evening , he cancelled his press meet about travel permit issue.
Please Wait while comments are loading...