చిత్తూరుకు పాకిన హిజాబ్ ఆందోళనలు-ముస్లిం మహిళల భారీ ర్యాలీ
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం క్రమంగా దేశవిదేశాలకు తాకింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా హిజాబ్ మా హక్కు అంటూ ముస్లిం మహిళలు రోడ్డెక్కుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ చిత్తూరు నగరంలోని శేషాపీరన్ మసీదు నుంచి జాతిపిత గాంధీ విగ్రహ కూడలి వరకు ముస్లిం మహిళలు భారీ సంఖ్యలో హిజాబ్ ధరించి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గ నాయకులు పాల్గొన్నారు.
చిత్తూరు నగరంలోని అన్ని మసీదు కమిటీల వారు ఏకమై ఈ ర్యాలీ నిర్వహించారు. శేషాపీరన్ మసీదు నుంచి జాతిపిత గాంధీ విగ్రహ కూడలి వరకు జరిగిన ర్యాలీకి చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం మహిళలు హిజాబ్ మా హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహ కూడలిలో సభను ఉద్దేశించి ముస్లిం మత బోధకులు జిలాని మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కు కలిగి ఉందని. అన్ని వర్గాల ప్రజలు కలసి మెలసి ఉన్నారని, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరులు వారి మతాన్ని గౌరవిస్తూ, వారి మతాచారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ వారికి ఉందని గుర్తు చేశారు.

అదేవిధంగా ఇస్లాం మతం ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ప్రతి ముస్లిం మహిళకు ఉందని మత పెద్దలు అన్నారు. ముస్లిం నాయకులు అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉన్నారని. కొన్ని దుష్ట శక్తులు వారి పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వివాదాలు లేవనెత్తారని, అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో జరుగునున్న ఎన్నికల నేపథ్యంలో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం కోసం హిజాబ్ ను పాఠశాలల్లో, కళాశాలల్లో ధరించడం అనుమతించకూడదని లేవనెత్తడం హీనమైన చర్య అని గుర్తు చేశారు. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం మతం ఇచ్చిన ఒక గొప్ప వరం అని అన్నారు. అంతేకాకుండా కొంతమంది సామాజిక మాధ్యమాలలో కులమతాలను రెచ్చగొట్టేవిధంగా హిజాబ్ వివాదాన్ని పెంచుతూ పోస్ట్ చేయడం,వాటిని కొందరు ముస్లింలు జవాబులు ఇవ్వడం మంచి విషయం కాదని, ఇలాంటి పోస్టులు చేస్తున్న, చేయిస్తున్న వ్యక్తుల కదలికలపై ఇప్పటికే పోలీసు శాఖ దృష్టి సారించిందని అన్నారు.

జిల్లాలోని పాఠశాల, కళాశాల లో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ వేసుకొని వస్తే అనుమతించాలని, ఎవరైనా అడ్డుకుంటే చట్టరీత్యా చర్యలు చేపట్టాలని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని అన్నారు. కొందరు మహిళలు మాట్లాడుతూ హిజాబ్ ధరించడం మా హక్కు అని, వాటిని అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు. అవసరమైతే మా హక్కును పొందేందుకు రోడ్డెక్కి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం అన్ని మసీదు కమిటీ వారి తరఫున వినతి పత్రాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి లకు గాంధీ విగ్రహ కూడలిలో అందించారు. వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని వారు హామీ ఇచ్చారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications