వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బియాస్ విషాదం: మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం

|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో గురువారం ఉదయం రెండు మృత దేహాలు అభ్యమయ్యాయి. గురువారం మధ్యాహ్నం మరో విద్యార్థి మృత దేహం లభ్యమైంది. మాచర్ల అఖిల్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు 12 మృత దేహాలు లభ్యమయ్యాయి.

ఇంకా 12 మృత దేహాలు లభ్యం కావాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను అధికారులు హైదరాబాద్‌కు పంపనున్నారు. గురువారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విద్యార్థులు శివప్రకాశ్ వర్మ, ఆశిష్‌ మంథాల మృతదేహాలుగా గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు తల్లిదండ్రులకు సమాచారమందించారు.

Himachal tragedy: One more body of a student recovered from Beas river

గురురవారం సాయంత్రానికి శివప్రకాశ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. కాగా, సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన ఆశీష్ మంథా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు.

ఏడాది క్రితం భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆశీష్ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీంటిపర్యంతమైంది.
మొత్తం 24 మంది బియాస్ నదిలో గల్లంతవగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 12మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

English summary
One more body of a student was recovered from Beas river on Wednesday, eleven days after, 24 students from a Hyderabad engineering college, were swept away in the river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X