వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శేఖర్ జోక్యంపై తెలుగుతమ్ముళ్ళ ఆగ్రహం..బాలయ్యకు చెప్పేదెలా?

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు, నాయకులు బాలకృష్ణ వ్యక్తిగత సహకుడు శేఖర్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హిందూపురం:సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపి కార్యకర్తలు, నాయకులు బాలకృష్ణ వ్యక్తిగత సహకుడు శేఖర్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి బాలకృష్ణ పోటీచేసి విజయం సాధించారు.

బాలకృష్ణ నియోజకవర్గానికి అప్పుడప్పుడూ వెళ్ళివస్తుంటాడు. అయితే నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులను ఆయన వ్యక్తిగత సహయకుడు శేఖర్ పర్యవేక్షిస్తుంటాడు.

అయితే బాలయ్య వ్యక్తిగత సహయకుడు శేఖర్ తీరుపై హిందూపురం టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. హిందూపురం నుండి శేఖర్ ను పంపితేనే తమకు న్యాయం జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

బాలకృష్ణ పిఎ శేఖర్ పై టిడిపి నాయకుల గుర్రు

బాలకృష్ణ పిఎ శేఖర్ పై టిడిపి నాయకుల గుర్రు

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ అందుబాటులో ఉండరు.అయితే ఆయనకు ఇవ్వాల్సిన ధరఖాస్తులు, అభివృద్ది కార్యక్రమాల పనుల తీరుతో పాటు ఇతర వ్యవహరాలను పర్యవేక్షణకుగాను బాలయ్య శేఖర్ ను హిందూపురంలో నియమించాడు. శేఖర్ బాలకృష్ణ పిఎగా పనిచేస్తున్నాడు.అయితే బాలకృష్ణ పిఎ శేఖర్ వ్యవహరశైలిపై స్థానిక టిడిపి నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.శేఖర్ వల్ల తమకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని వారు అబిప్రాయంతో ఉన్నారు.

శేఖర్ మితీమీరిన జోక్యంతో తమ్ముళ్ళ అసంతృప్తి

శేఖర్ మితీమీరిన జోక్యంతో తమ్ముళ్ళ అసంతృప్తి

బాలకృష్ణ నియోజకవర్గానికి మరీ ముఖ్యమైన కార్యక్రమాలుంటే తప్ప రావడంలేదు. అయితే ఇక్కడ కార్యక్రమాలన్నీ పిఎ శేఖర్ చక్కబెడుతున్నారు.అభివృద్ది పనులతో పాటు పార్టీ వ్యవహరాల్లో కూడ పిఎ శేఖర్ జోక్యం పెరిగిపోయిందని స్థానిక పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. శేఖర్ ను హిందూపురం నుండి తప్పిస్తేనే తమకు ప్రయోజనం ఉంటుందని వారు భావిస్తున్నారు.అన్నింట్లోనూ శేఖర్ మితిమీరిన జోక్యంతో వారు తెలుగుతమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు.

టిడిపి నాయకుల సమావేశం

టిడిపి నాయకుల సమావేశం

శేఖర్ ను హిందూపురం నుండి ఎలాగైనా తప్పిస్తేనే తమకు మనుగడ ఉంటుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఈ మేరకు హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు చెందిన టిడిపిలోని అసంతృప్తులు సమావేశమయ్యారు. ఈ నెల 25న, చిలమత్తూరు మండలంలోని కోడూరులో జరిగిన జాతరలో వీరంతా మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఇంట్లో సమావేశమయ్యారు. ఆపరేషన్ పిఎ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మాజీ ఎంఏల్ఏ వెంకటరాముడు నేతృత్వం

మాజీ ఎంఏల్ఏ వెంకటరాముడు నేతృత్వం

మాజీ ఎంఏల్ఏ సిసి వెంకటరాముడు , పార్టీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ పిఎ శేఖర్ కు చెక్ పెట్టేందుకు నాయకత్వం వహిస్తున్నారు. హిందూపురంలోని కొందరు సీనియర్ నాయకులతో కూడ వీరంతా సంప్రదింపులు జరిపారు. అలాగే ఈ నెల 29వ, తేదిన హిందూపురం మండలంలోని అప్పలకుంటలోని డిసి ఆంజనేయులు తోటలో సమావేశమయ్యారు. పిఎ శేఖర్ అనుసరిస్తోన్న తీరుతో ఏ రకంగా ఇబ్బంి పడుతున్నారనే విషయాన్ని టిడిపి కార్యకర్తలు ఈ సమావేశంలో ప్రస్తావించారు

బాలకృష్ణకు ఫిర్యాదు చేసేదేవరు

బాలకృష్ణకు ఫిర్యాదు చేసేదేవరు

శేఖర్ వ్యవహరశైలిపై బాలకృష్ణకు ఎవరు ఫిర్యాదు చేయాలనే దానిపై టిడిపి నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. శేఖర్ చెప్పినట్టుగానే బాలకృష్ణ నడుచుకొంటారు.అయితే శేఖర్ పై చేసే ఫిర్యాదులను బాలయ్య విశ్వసిస్తారా అనేది టిడిపి నాయకులను వెంటాడుతోంది. అయితే శేఖర్ వ్యవహరశైలి పై బాలయ్యకు పిర్యాదు చేసేందుకుగాను ఓ సీనియర్ నాయకుడికి బాద్యతలను అప్పగించారని తెలిసింది.

English summary
hindpur tdp leaders angry about balakrishna p.a. shekar attitude, tdp leaders will complaint against to shekar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X