దిగ్విజయం: చంద్రబాబు పేరిట గుంటూరులో ప్రత్యేక హోమాలు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్విజయంగా విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా వ్యాప్తి చెందేలా కృషి చేసినందుకు గానూ గుంటూరులో హోమం నిర్వహించారు.

2019 సాదారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అమరావతీ నగరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పానికి ఆ పరమేశ్వరుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని గుంటూరు అరండల్ పేట శివాలయంలో తెలుగుదేశం పార్టీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

homam held in Guntur in the name of Chandrababu

ఎనిమిది మంది ఋత్వికలచే చంఢీ, మహరుద్ర యాగాలను వేదోక్తంగా జరిపించారు. అనంతరం గర్భాలయం కోలువైన స్వామీ వారీ మూలవిరాట్ కు విశేషాభిషేకాలు నిర్వహించారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు వర్ధిల్లాలని వేదపండితులచేత నరేంద్ర ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A huge Homam held in Guntur in the name of Chandrababu Naidu on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి