దిల్ రాజుకు షాక్ ఇచ్చిన సలార్ నిర్మాతలు?
సలార్ చిత్ర నిర్మాతల నుంచి దిల్ రాజుకు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఓ వ్యవహారానికి సంబంధించి పారదర్శకంగా వ్యవహరించలేకపోయారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దేశవ్యాప్తంగా సలార్ చిత్రాన్ని దక్కించుకునేందుకు ప్రాంతాలవారీగా పేరున్న నిర్మాణ సంస్థలతోపాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. నైజాం ఏరియాలో సలార్ చిత్రాన్ని విడుదల చేసేందుకు థియేట్రికల్ హక్కును రాజు సొంతం చేసుకోవాలనుకున్నారు. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారు.
అయినప్పటికీ హోంబలే ఫిలింస్ నిరాకరించింది. వీరి కేజీఎఫ్ 2 చిత్రాన్ని నైజాంలో విడుదల చేసింది కూడా దిల్ రాజే. అయితే ఆ సినిమా ఫైనల్ నెంబర్స్ విషయంలో దిల్ రాజు పారదర్శకంగా వ్యవహరించలేదని తెలుస్తోంది. ఫ్యాన్సీ అమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ హోంబలే ఫిలింస్ ఆసక్తి చూపించడంలేదు. ఇతర డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ పోటీపడుతున్నాయి. ఒకరకంగా దిల్ రాజుకు ఇది షాక్ లాంటిదని ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరచలేదు. దీంతో వారంతా భారీ యాక్షన్ ప్యాక్డ్ అయిన సలార్ పై అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబరు 28వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్, జగపతిబాబు, శ్రియారెడ్డి తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ 3 రోజుల్లోనే 100 మిలియన్లు దాటి కొత్త రికార్డు సృష్టించింది. ట్రైలర్ రిలీజైతే ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందోనని భావిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా బిజినెస్ వ్యవహారాలను హోంబలే ఫిలింస్ పూర్తిచేయాలని భావిస్తోంది. సలార్ చిత్రానికి భారీ క్రేజ్ ఉండటతో ఈ చిత్రం హక్కుల కోసం డిమాండ్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications