హోం గార్డ్ నిర్వాకం: మహిళ స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ
విశాఖపట్నం: మహిళ స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న హోం గార్డ్‌ని అదుపులోకి తీసుకున్న సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నగరంలోని గాజువాక రజక వీధిలో ఓ మహిళ స్నానం చేస్తుండగా హోంగార్డు సంతోష్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇది చూసిన మహిళ వెంటనే స్ధానికులకు తెలియజేసింది.
దీంతో స్ధానికులు హోంగార్డుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు హోంగార్డును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరు కూలీలు మృత్యువాత
మరుగుదొడ్డిని నిర్మించేందుకు గొయ్యి తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రోలుగుంట మండలం ఎం కొత్తపట్నం గ్రామంలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంత తవ్వుతుండగా పైనుంచి మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications