అమరావతి రైతులకు హోం మంత్రి సుచరిత హెచ్చరిక; పాదయాత్ర పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి సుచరిత పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు లోబడి మాత్రమే అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మేకతోటి సుచరిత, స్వామివారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆమె కోరుతున్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజసేవ చేస్తున్నారని మేకతోటి సుచరిత స్పష్టంచేశారు.

మహా పాదయాత్ర పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం
రాజధాని అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిబంధనల ఉల్లంఘన జరిగితే నోటీసులు ఇస్తామని మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. రైతుల మహా పాదయాత్రకి నోటీసులు ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి సుచరిత కరోనా నిబంధనలు, లౌడ్ స్పీకర్ల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అంటూ ప్రశ్నించిన హోంమంత్రి సుచరిత పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని రాష్ట్ర పరిధిలో లేదని స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై లోకేష్ కు హోం మంత్రి ప్రశ్న
ఇక వైసీపీ ప్రభుత్వంపై పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ కు ప్రశ్నలు సంధించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంత తగ్గించారో నారా లోకేష్ చెప్పాలని హోంమంత్రి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంచాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ఏడు రోజుల పాటు కొనసాగింది. ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. రేపు తిరిగి న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో పాదయాత్రను ముందుకు కొనసాగించనున్నారు.

రైతుల మహా పాదయాత్రకు పోలీసుల నోటీసులపై లోకేష్ ఫైర్
రేపు ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుండి రాజధాని అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రకు పోలీసులు కావాలనే అవాంతరాలు సృష్టిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైకాపా వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ ప్రశ్నించారు. వైకాపా ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులు జారీ చెయ్యడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
Recommended Video

అమరావతి ఉద్యమాన్ని చంపేసే కుట్ర చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం
కొంతమంది పోలీసుల దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు నారా లోకేష్. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణచివేయాలని వైయస్ జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి భంగపాటు తప్పదని హెచ్చరించారు నారా లోకేష్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అంటూ పేర్కొన్న లోకేష్ తుగ్లక్ నిర్ణయాలతో రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతమవుతోంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications