వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టర రేట్ - 31న విశాఖ నగరానికి..!!

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలో డాక్టర్ ఎన్వీ రమణ కాబోతున్నారు. ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నెల ఆగస్టు 26 వరకు ఆయన సీజేఐ హోదాలో కొనసాగనున్నారు. దీంతో..పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ సీజేఐ ను ఎంపిక చేసింది.

ఉస్మానియా నుంచి అందుకున్న వారి జాబితాలో

ఉస్మానియా నుంచి అందుకున్న వారి జాబితాలో

ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత-అమెరికన్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ అరుణ్‌నేత్రావలికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు. 105 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది.

తెలుగు వ్యక్తిగా ఇప్పుడు సీజేఐ

తెలుగు వ్యక్తిగా ఇప్పుడు సీజేఐ

ఇప్పటి వరకు ఈ విశ్వ విద్యాలయంలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించారు. కానీ, ఇప్పటి వరకు 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసారు. 1917లో నవాబ్‌ జమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌కు ఇచ్చింది. ఉస్మానియా నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్న వారిలో విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సి.రాజగోపాలాచారి, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, డాక్టర్‌ వై.నాయుడమ్మ, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వంటి వారున్నారు. ఇప్పుడు తెలుగు వ్యక్తిగా.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ ఈ డాక్టరేట్ అందుకోనున్నారు.

విశాఖలో పర్యటన వేళ

విశాఖలో పర్యటన వేళ

ఇక, సీజేఐ ఈ నెల 31న విశాఖకు రానున్నారు. 31 మధ్నాహ్నం విశాఖ చేరుకొనే సీజేఐ పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. సాయంత్రం విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగే రాచకొండ విశ్వనాధశాస్త్రి శత జయంతి వేడుల్లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పొల్గొంటారు. అదే రోజు రాత్రి తిరిగి ఢిల్లీ వెళ్తారు. సీజేఐ విశాఖకు రానుండంతో.. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు సైతం వస్తున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందింది.

English summary
Honorory Doctorate for CJI NV Ramana from Osmania University on 5th August, CJI to visit Vizag on 31st of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X