వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్..!!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 1న కర్ణాటక అసెంబ్లీలో అధికారికంగా కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర అత్యున్న పురస్కారం కర్ణాటక రత్న అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు ఇవ్వనున్నారు. దీంతో, పునీత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు కర్ణాటక సీఎం వెల్లడించారు.

కన్నడ ప్రజల్లో పునీత్ రాజ్ కుమార్ కు ఉన్న ఆదరణ..అభిమానం కు గుర్తుగా ఈ అవార్డు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇదే కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించారు. పునీత్ రాజ్ కుమార్ కటుంబంతో పాటుగా చంద్రశేఖర్ కంబర్ ను ఆహ్వానించినట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 23న పునీత్ రాజ్ కుమార్ ఆకస్మికంగా మరణించారు.

Honour to Junior NTR: Special invitee to Karnataka assembly ,details here

ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నెలకొంది. టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు పునీత్ భౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. జానియర్ ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్లి, పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ నవంబర్ 1న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు.

కర్ణాటకలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నుంచి ప్రత్యేక అతిధి హోదాలో జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న వార్త వైరల్ అవుతోంది.తారక్​ కర్ణాటక ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ జపానీ భాషలో మాట్లాడి అదుర్స్ అనిపించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో హైదరాబాద్ లో భేటీ తరువాత రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కర్ణాటకలోని ప్రభుత్వం జూనియర్ ను అతిధిగా ఆహ్వానించటం పైన ఆసక్తి కర చర్చ మొదలైంది.

English summary
Junior NTR to Enter in Karnataka Assembly, CM Bommai invited JR NTR For Kannada Rajostsavam programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X