స్వర్ణమయి బార్‌లో వాటాలు: మల్లాది విష్ణును అరెస్టు చేస్తారా?
విజయవాడ: కల్తీ మద్యం సేవించి ఐదుగురి మృతికి కారణమైన స్వర్ణ బార్‌లో కాంగ్రెసు నేత మల్లాది విష్ణుకు వాటాలున్నట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. అలా ధృవీకరించుకున్న తర్వాతనే పోలీసులు ఆయనపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ బార్‌తో మల్లాది విష్ణుకు సంబంధం లేదని, ఆయన తల్లికి వాటాలున్నాయని, మల్లాది విష్ణును కావాలనే కేసులో ఇరికిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఇంతకు ముందు చెప్పారు.
అయితే, స్వర్ణమయి బార్‌లో మల్లాది విష్ణుకు వాటాలున్నాయని నిరూపించే ఆధారాలను పోలీసులు సేకరించారు. 2014 ఎన్నికల సమయంలో విష్ణు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ను పోలీసులు సంపాదించారు. తనకు స్వర్ణమయి బార్‌లో వాటాలున్నాయని ఆయన స్వయంగా అందులో చెప్పారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. మల్లాది విష్ణును కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తోంది. ఈ మేరకు స్థానికంగా మీడియాలో వార్తలు వచ్చాయి.
స్వర్ణమయి బార్ గవర్నర్‌పేటలోని స్వర్ణా కాంప్లెక్స్‌లసో ఉంది. స్వర్ణమయి బార్‌తో పాటు కృష్ణలంకలో ఉన్న స్వర్ణా బార్, గాంధీనగర్‌లోని ఖుషీ బార్ మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు చెందినవేనని చెబుతున్నారు. ఆబ్కారీ శాఖలో ఈ మూడింటిని కూడా విష్ణు బార్‌లుగానే పరిగిణిస్తుంటారని తెలుస్తోంది.

కాగా, కృష్ణలంకలో ఉన్న స్వర్ణ బార్‌తో కూడా మల్లాది విష్ణుకు సంబంధాలున్నాయని పోలీసులు ధ్రువీకరించుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ స్థితిలో మల్లాది విష్ణు అందుబాటులో లేకుడా పోయారని అంటున్నారు.
కల్తీ మద్యం సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్‌గా ఉన్నారు. ఆయన మంగళవారం రాత్రి ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్రతో, పోలీసు, ఆబ్కారీ శాఖ అధికారులతో మాట్లాడారు. కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. బార్ యాజమాన్యంలో భాగస్వాములుగా ఉన్నవారిని ఇంత వరకు అరెస్టు చేయలేదు. పోలీసులు విష్ణును కేసులో తొమ్మిదవ నిందితునిగా చేర్చారు. దీంతో మిగతా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications