వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామకు బీజేపీ డోర్స్ క్లోజ్..? రూటు ఎటు - ఫిక్స్ అయిపోయారా..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రూటు ఎటు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా..ఆయన వచ్చే ఎన్నికల వరకు ఇదే పార్టీలో కొనసాగే అవకాశం లేదు. మరి..రఘురామ ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే దీని పైన ఒక నిర్ణయానికి వచ్చేసారా. తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలోనూ రఘురామ అంశం ప్రస్తావనకు వచ్చింది. మంత్రి జోగి రమేష్ విమర్శలు చేసారు. వైసీపీ అధినాయకత్వంతో విభేదాలు మొదలైన తరువాత రఘరామ ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అధినాయకత్వానికి దగ్గరయ్యారు. పలు సందర్భాల్లో వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో రఘురామ తీరు తో ఆగ్రహంగా ఉన్న వైసీపీ నేతలు ఆయన పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసారు.

బీజేపీతో సంబంధాలు కట్ అయినట్లేనా

బీజేపీతో సంబంధాలు కట్ అయినట్లేనా

కానీ, ఇప్పటికీ ఆ వ్యవహారం పెండింగ్ లో ఉంది. దీని పైనే రఘురామ సవాల్ చేసారు. వైసీపీ నేతలకు చేతనైతే తన పైన అనర్హత వేటు వేయించాలని ఛాలెంజ్ విసిరారు. ఇక, హైదరాబాద్ వచ్చిన సమయంలో రఘురామ పైన రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసారు. రిమాండ్ సమయంలో తన పైన దాడి చేసారంటూ రఘరామ చేసిన ఫిర్యాదు దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ప్రధానితో సహా బీజేపీ ముఖ్యుల వద్ద రఘురామ రాజు కు మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం నడుమ తాజాగా.. భీమవరంలో చోటు చేసుకున్న పరిణామంతో అందులోనే నిజం లేదనే చర్చ మొదలైంది. ప్రధాని పాల్గొనే సభలో స్థానిక ఎంపీగా రఘురామ పాల్గొనాల్సి ఉన్నా.. వైసీపీతో రఘురామ విభేదాలు తెలిసినా.. ప్రధాని కార్యాలయం నిర్దారించిన ఆహుతుల జాబితా లో రఘురామ పేరు లేదు.

వైసీపీతో కట్.. ఏ పార్టీ వైపు చూపు

వైసీపీతో కట్.. ఏ పార్టీ వైపు చూపు


ఇదంతా వైసీపీ ముఖ్య నేల ఒత్తిడి మేరకే జరిగిందనే వాదన ఉంది. దీనిని రఘురామ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో తాను ఎంపీ పదవికి పోటీ చేస్తానని.. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ రఘురామ చెప్పుకొచ్చారు. రఘురామ ఇప్పటికిప్పుడు కాకున్నా...ఎన్నికల నాటికి బీజేపీలో చేరుతారనే అంచనాలు ఉన్నాయి. అయితే, తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఆయనకు బీజేపీలో ఎంట్రీ ఉండనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, పలు సందర్బాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎంపీ రఘురామకు సంఘీభావం ప్రకటిస్తూ వచ్చారు. దీంతో..వచ్చే ఎన్నికల్లో రఘురామ ఈ రెండు పార్టీల్లో ఒక దానిని ఎంచుకోవటం ఖాయమని చెబుతున్నారు. అయితే, నర్సాపురం ఎంపీగా గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసారు. ఈ సారి ఆయన పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.

నర్సాపురం నుంచే తిరిగి పోటీ

నర్సాపురం నుంచే తిరిగి పోటీ


టీడీపీ - జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో ఆయన జనసేన అభ్యర్ధిగా నర్సాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి సైతం నర్సాపురం ఎంపీ సీటు కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, పొత్తు ఖరారు కాకుండా.. నర్సాపురం సీటు పైన చంద్రబాబు సైతం నిర్ణయం తీసుకొనే అవకాశాలు లేవు. పొత్తు ఉంటే ఉమ్మడి అభ్యర్ధిగా రఘురామ రాజు బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు అటు టీడీపీ - ఇటు జనసేన రెండు పార్టీల నుంచి మద్దతు ఉండటంతో.. పాత్తు ఆధారంగానే తన సీటు పైన స్పష్టమైన హామీతో రఘురామ ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ అభ్యర్ధి పైన నర్సాపురం నుంచి గెలవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో నర్సాపురం నుంచి రఘురామ పోటీ చేస్తే..ఎలాగైనా ఓడించాలనేది వైసీపీ ధ్యేయంగా ఉంది. దీంతో.. రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఫలితం ఎలా ఉంటుందనే అంచనాలు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి.

English summary
YSRCP Rebel MP Raghu Rama Raju cotest form Narsaputram loksabha TDP - Janaseana common candidate for up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X