Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2020లో ఏపీలో విషం చిమ్మిన విషాదం , భయానక దృశ్యం .. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన

2020 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం నింపింది, విషాన్ని చిమ్మింది విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన. మే 7వ తేదీన విశాఖ లోని ఆర్ వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అవడంతో 15 మంది చనిపోగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి అయినప్పటికీ నేటికీ చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. విషవాయువు దెబ్బకు సమీప గ్రామాలలో వాతావరణం పూర్తిగా కలుషితమైంది. పశువులు ,పక్షులు ప్రాణాలు కోల్పోగా, పెద్ద పెద్ద చెట్లు సైతం నిలువునా మాడిపోయాయి. ఈ దుర్ఘటన మిగిల్చిన విషాదం ఏపీ వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు .

Recommended Video

    2020 Disaster In AP : LG Polymers Gas Leak

    కరోనాతో సతమతం అవుతున్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన

    కరోనాతో సతమతం అవుతున్న సమయంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన

    అసలే రాష్ట్రం కరోనాతో అతలాకుతలం అవుతుంటే ఎల్జీ పాలిమర్స్ లో ఎవరూ ఊహించని విధంగా మే 7వ తేదీన తెల్లవారు జామున జరిగిన ప్రమాదం ఏపీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. విశాఖపట్నం లోని ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ లో గ్యాస్ లీకేజ్కారణంగా సమీప గ్రామాల ప్రజలు వేలాది మంది ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర ఈ విష వాయువు వ్యాపించటంతో వేల సంఖ్యలో ప్రజలు అస్వస్థత కు గురయ్యారు.తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతోనిద్రమత్తులో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు .

    దేశం ఉలిక్కిపడిన అతిపెద్ద ప్రమాదం .. హైపవర్ కమిటీ వేసిన జగన్

    దేశం ఉలిక్కిపడిన అతిపెద్ద ప్రమాదం .. హైపవర్ కమిటీ వేసిన జగన్

    తలుపులు పగులగొట్టి ఇళ్లలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు . అతి పెద్ద ప్రమాదం జరగటంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అధికారులకు తక్షణ ఆదేశాలు అందించింది. బాధితులకు ఎంత ఖర్చైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే సరైన వైద్య సేవలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీ సీఎం జగన్ హుటాహుటిన విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ , హోం శాఖా మంత్రి అమిత్ షా ,భారత ఉపరాష్ట్ర పతివెంకయ్య నాయుడు , తెలంగాణా సీఎం కేసీఆర్ స్పందించారు. దేశం మొత్తం ఒక్కసారిగా విశాఖ ఎల్జి పాలిమర్స్ పై దృష్టిసారించింది . అంతేకాదు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ హైపవర్ కమిటీని వేసి విచారణకు ఆదేశించారు .

     మృతుల కుటుంబాలకు కోటి నష్ట పరిహారం ఇచ్చిన సీఎం జగన్ .. బాధితుల కోసం కీలక నిర్ణయాలు

    మృతుల కుటుంబాలకు కోటి నష్ట పరిహారం ఇచ్చిన సీఎం జగన్ .. బాధితుల కోసం కీలక నిర్ణయాలు

    గ్యాస్ లీక్ బాధితుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ గ్యాస్ లీక్ బాధితుల మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు . ఆసుపత్రిలో రెండు మూడు రోజుల పాటు ఉన్న చికిత్స పొందిన వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్ పై ఉన్న వారికి పది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రథమ చికిత్స చేయించుకున్న వారికి 25 వేల రూపాయలు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడం దేశరాజకీయాల్లో సంచలనం అయింది. బాధిత గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి కొంత కాలం పాటు వైద్య సేవలు కొనసాగాయి. వారికి ఆరోగ్య భరోసా ఇవ్వడానికి హెల్త్ కార్డులు కూడా జారీ చేశారు.

    యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అని ప్రాధమిక నిర్ధారణ .. కేసు నమోదు, ఎల్జీ పాలిమర్స్ సీజ్

    యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అని ప్రాధమిక నిర్ధారణ .. కేసు నమోదు, ఎల్జీ పాలిమర్స్ సీజ్

    విశాఖలోని ఎల్జీ పాలిమర్స్గ్యాస్‌ లీక్‌ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత కంపెనీ యాజమాన్యంపైకమీషనరేట్ పోలీసులుకేసు నమోదు చేశారు. ఎల్జి పాలిమర్స్ ను సీజ్ చేశారు. ఎల్జి పాలిమర్స్ డైరెక్టర్ల వద్దనుండి పాస్ పోర్ట్ లు సరెండర్ చేయించారు .ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారం పై అటు కేంద్రం నుండి, ఇటు రాష్ట్రం నుండి 9 విచారణ సంస్థలు విచారణ చేపట్టాయి . ఎల్జి పాలిమర్స్ యాజమాన్యానికి ఊపిరాడనివ్వకుండా చేశాయి. ఈ వ్యవహారాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా ఈ కేసును తీసుకున్న నేషనల్ ట్రిబ్యునల్ ఈ కేసుపై విచారణ జరిపింది.

    50 కోట్ల రూపాయల పాక్షిక నష్టపరిహారం చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం

    50 కోట్ల రూపాయల పాక్షిక నష్టపరిహారం చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం

    రసాయనాలతో కూడిన ప్లాంట్లలో పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడం కోసం కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విశాఖ ఎల్జి పాలిమర్స్ కేసులో 50 కోట్ల రూపాయల పాక్షిక నష్టపరిహారాన్ని పర్యావరణ పునరుద్ధరణ కోసం, బాధితుల కోసం ఇవ్వాలని ఆదేశించింది. ఆపై పూర్తి నష్టపరిహారాన్ని అంచనా వేయడం కోసం కేంద్ర పర్యావరణ శాఖ , కాలుష్య నియంత్రణ మండలి కలిసి అధ్యయనం చేయాలని రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఎల్జి పాలిమర్స్ యాజమాన్యం 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ కు అందించారు.

    ఎల్జీ పాలిమర్స్ పై 9 విచారణా సంస్థల విచారణ

    ఎల్జీ పాలిమర్స్ పై 9 విచారణా సంస్థల విచారణ

    ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నేపథ్యంలో పరిశ్రమ పై దృష్టిసారించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాలుష్య కారకాలైన పరిశ్రమలను లిస్ట్ అవుట్ చేయాలని, నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో ఉండకుండా వాటిని తరలించాలని కూడా పేర్కొన్నారు.
    పర్యావరణ అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్ కొనసాగుతుందని పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చింది. గ్యాస్‌ లీక్‌ ఘటనపై గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాలు, జాతీయ మానవ హక్కుల సంఘం, పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు ఇతర అథారిటీలు, కమిటీల నివేదికల ఆధారంగా విచారణ కొనసాగింది.ఏది ఏమైనాఏపీలోపరిశ్రమల నిర్వహణలోని డొల్లతనంఎల్జీ పాలిమర్స్సంస్థలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనతోబయటకు వచ్చింది.

    హైపవర్ కమిటీ నివేదిక .. 24 గంటల్లోనే ఎల్జీ యాజమాన్యం అరెస్ట్ .. రిమాండ్

    హైపవర్ కమిటీ నివేదిక .. 24 గంటల్లోనే ఎల్జీ యాజమాన్యం అరెస్ట్ .. రిమాండ్

    గ్యాస్ లీక్ దుర్ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన హైపవర్ కమిటీ కూడా సమగ్ర విచారణ జరిపి బాధిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను, గ్యాస్ లీక్ ఘటనకు గల కారణాలను, అటు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య వివరణను ,సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన అభిప్రాయాలనునమోదు చేసింది. అంతేకాదు ప్రమాదం జరిగిన తీరును, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండాతీసుకోవలసిన జాగ్రత్తలను హైపవర్ కమిటీ నివేదిక తయారు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి అందించింది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక తో 24 గంటల్లోపు వారిపై చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా ఎల్జీ పాలిమర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈవో సుంకి జియోంగ్ ,టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్ తదితరులనుఅరెస్ట్ చేసిన పోలీసులు 12 మంది నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. నిందితులకు14 రోజుల రిమాండ్విధించారు మెజిస్ట్రేట్.

     రికారుల నిర్వహణకు అనుమతించి ఎల్జీ యాజమాన్యానికి ఊరట నిచ్చిన హైకోర్టు

    రికారుల నిర్వహణకు అనుమతించి ఎల్జీ యాజమాన్యానికి ఊరట నిచ్చిన హైకోర్టు

    అప్పటి నుండి ఇప్పటి వరకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వ కఠిన చర్యలతోవరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్నఎల్జి పాలిమర్స్ సంస్థకుహైకోర్టుకాస్త ఊరట కలిగించేవిషయం అక్టోబర్ 9వ తేదీన చెప్పింది . ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన తర్వాత సంస్థ లోపలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించలేదు . ఆ కారణంగా రికారుల నిర్వహణ నిలిచిపోయిందని కోర్టును ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్ కు రికార్డుల నిర్వహణ కోసం16 మంది ఆ సంస్థ అకౌంటింగ్ విభాగ సిబ్బందిలోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది ఏపీ హైకోర్టు.

     నేటికీ కొనసాగుతున్న కేసుల విచారణలు .. ప్రజల జీవితాలపై విషం తాలూకు చేదు జ్ఞాపకాలు

    నేటికీ కొనసాగుతున్న కేసుల విచారణలు .. ప్రజల జీవితాలపై విషం తాలూకు చేదు జ్ఞాపకాలు

    ఎల్జీ పాలిమర్స్ లో వారు వెళ్ళే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతోరికార్డు చేయాలనిపేర్కొంది. ఈ మేరకుప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది . దీంతో ఎల్జీ పాలిమర్స్ కు కాస్త ఊరట లభించినట్లయింది. ఇప్పటికీ విశాఖ నగర సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో విషం చిమ్మిన ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన తాలూకా కేసుల విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ వందల సంఖ్యలో ప్రజల జీవితాలపై చిమ్మిన విషం మాత్రం ఇప్పటికీ వారి ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తూనే ఉంది .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+