దంపతులు ఇద్దరూ పోలీసులే, తిరుమలలో హోటల్ యజమాని ఏం చేశాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారినా తిరుమలలో హోటల్ యజమానుల తీరుమాత్రం మారలేదని మరోసారి వెలుగు చూసింది. తిరుమలలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు తిరుమలలోని పలు హోటల్స్ లో ఆకస్మికంగా తనిఖీలు చేసి నాణ్యతలేని ఆహారం అందిస్తున్న హోటల్ యజమానులకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలు హోటల్స్ సీజ్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకున్నారు.
అయితే సీల్ ఓపెన్ చేసిన వాటర్ బాటిల్ ఎక్కువ ధరకు విక్రయించడమే కాకుండా తిరుమలలో పోలీసుతో పాటు మహిళ పోలీసు మీద, టీటీడీ సెక్యూరిటీ మీద హోటల్ యజమాని దాడి చెయ్యడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న టీటీడీ రెవెన్యూ శాఖ అధికారులు, తిరుమల పోలీసులు హోటల్ ను సీజ్ చేసి దాడి చేసి పారిపోయిన ఆ హోటల్ యజమాని కోసం గాలిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఎపీఎస్పీ కానిస్టేబుల్ కే. చంద్రబాబు నివాసం ఉంటున్నాడు. చంద్రబాబు భార్య అనూజ విశాఖపట్టణంలోని న్యూపోర్టు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. చంద్రబాబు, అనూజ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల బయలుదేరారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న చంద్రబాబు, అనూజ దంపతులు లగేట్ కౌంటర్ దగ్గర లగేజ్ తీసుకోవడానికి వెళ్లారు.
ఆ సందర్బంలో చంద్రబాబు కుమారుడు వాటర్ బాటిల్ కావాలని ఆడిగాడు. చంద్రబాబు కుమారుడికి డబ్బులు ఇచ్చి సమీపంలోని హోటల్ లో వాటర్ బాటిల్ తీసుకోమని చెప్పాడు. చంద్రబాబు కుమారుడు సురేష్ అనే వ్యక్తి హోటల్ దగ్గరకు వెళ్లాడు ఆ సందర్బంలో హోటల్ యజమాని సురేష్ సీల్ ఓపెన్ చేసిన వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి వాటర్ బాటిల్ సీల్ ఓపెన్ చేశారని అతని తల్లి కానిస్టేబుల్ అనూజాకు చెప్పాడు.
అనూజ హోటల్ దగ్గరకు వెళ్లి ఈ వాటర్ బాటిల్ వెనక్కి తీసుకుని సీల్ చేసిన వాటర్ బాటిల్ ఇవ్వాలని చెప్పింది. ఆ సమయంలో హోటల్ యజమాని సురేష్ లేడీ కానిస్టేబుల్ అనూజతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను బూతులు తిట్టాడు. ఆ తర్వాత అనూజ కుమారుడు వెళ్లి అతని తండ్రి చంద్రబాబుకు చెప్పాడు. చంద్రబాబు వెళ్లి హోటల్ యజమానిని ప్రశ్నించాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన హోటల్ యజమాని సురేష్ వాటర్ బాటిల్ తీసుకుని కానిస్టేబుల్ చంద్రబాబు మీద దాడి చెయ్యడంతో గాజు బాటిల్ పగిలి కానిస్టేబుల్ చంద్రబాబు చెవి పగిలి రక్తం వచ్చింది.

భర్త చంద్రబాబు మీద దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన లేడీ కానిస్టేబుల్ అనూజ కడుపు మీద తన్నిన హోటల్ యజమాని హంగామా చేశాడు. విషయం తెలుసుకున్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సాయికుమార్ మీద హోటల్ యజమాని సురేష్ దాడి చేశాడు తరువాత పోలీసు దంపతులు చంద్రబాబు, అనూజ తిరుమల పోలీసులను ఆశ్రయించి హోటల్ యజమాని సురేప్ మీద ఫిర్యాదు చేశారు. టీటీడీ సెక్యూరిటీ గార్డు సాయికుమార్ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, టీటీడీ రెవెన్యూ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సురేష్ హోటల్ ను సీజ్ చేశారు. పోలీసు దంపతుల మీద దాడి చేసిన హోటల్ యజమాని సురేష్ పారిపోయాడని, అతని మీద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పోలీసు దంపతుల మీద దాడి జరడంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. భార్య, భర్తులు ఇద్దరూ పోలీసులు కావడం, ఇద్దరి మీద హోటల్ యజమాని దాడి జరడంతో తిరుమలకు వచ్చే సామాన్యభక్తుల పరిస్థితి ఏమిటి అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications