విశాఖలో 130 జాకీల సాయంతో ఇంటిని అమాంతం పైకి లేపారు (వీడియో)
అమరావతి: భారీ వర్షాలు, వరదలు కురిసినప్పుడు వర్షపు నీరు రోడ్డు దిగువన ఉన్న ఇళ్లలోకి వస్తుంది. అలాంటి సమయంలో వర్షపు నీరు ఇంట్లోకి రావడం చాలా మందికి చిరాకుగా ఉంటుంది.అలాంటి చిరాకు నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి జాకీల సాయంతో తన ఇంటిని పైకి లేపాడు.
వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌కు చెందిన మాజీ ఉద్యోగి రామ్ గోపాల్ నగరంలోని ఎంవీపీ కాలనీలోని తన రెండంతస్తుల భవంలో నివసిస్తున్నాడు. వర్షాలు, వరదలు సంభవించినప్పుడు రోడ్డుకు దిగువగా ఉన్న తన ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి చేరేది.
దీనికి విసిగిపోయిన ఆయన హర్యానాలోని కురుక్షేత్రలోని శ్రీరామా బిల్డింగ్ లిప్టింగ్‌ని సంప్రదించారు. వారు వచ్చి తన రెండుస్తుల భవనం మొత్తం బరువు 600 టన్నులుగా నిర్ధారించారు. 130 జాకీలను ఉపయోగించి ఇంటిని 4 అడుగుల పైకి లేపారు.
ఒక్కో జాకీ 8.5 టన్నుల బరువును ఆపుతుంది. ముందుగా గోడలు, బీమ్ లు కింద యంత్రాల సాయంతో కట్ చేశారు. ఆ ఖాళీలో నాలుగు అంగుళాల స్టీల్ మాడ్యులర్లను కాంక్రీట్‌తో నింపి అమర్చారు. వాటి కింద జాకీలను అమర్చారు.
ఈ మొత్తం పనిలో 15 మంది ఆ జాకీలను తిప్పుతూ భవనాన్ని మెల్లగా పైకి లేపారు. నవంబర్ చివరి వారంలో ఈ పనిని ప్రారంభించారు. ఈ భవనాన్ని ఆరు అడుగుల పైకి లేపేందుకు గాను శ్రీరామా బిల్డింగ్ లిప్టింగ్ కంపెనీ రామ్ గోపాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications