పదవులు అందరికీ ఇవ్వలేను....పార్టీ కోసం పనిచేసినవారికే తొలి ప్రాధాన్యత...బాబు
గుంటూరు : నామినేటేడ్ పదవుల విషయంలో పార్టీలో అందరిని సంతృప్తి పర్చలేమని టిడిపి నాయకత్వం పార్టీ శ్రేణులకు సంకేతాలను పంపింది. చాలా కాలంగా పదవుల కోసం టిడిపి కార్యకర్తలు ఆశతో ఉన్నారు. వరుసగా రెండు దఫాలు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి క్యాడర్ .....నామినేటేడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.గత మాసంలోనే కొన్ని నామినేటేడ్ పోస్టులను భర్తీ చేశారు. మరికొన్ని పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నారు.
సుదీర్ఘ కాలం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల పంపకంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి చీప్ భావిస్తున్నారు.ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులతో పాటు...ఎన్నికల తర్వాత కూడ టిడిపిలో చేరిన నాయకులను కూడ సంతృప్తిపర్చాల్సిన భాద్యత అనివార్యమైంది. పదవుల విషయంలో ఆయా జిల్లాల నుండి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఆశించిన ప్రతి ఒక్కరికీ కూడ పదవులను కట్టబెట్టే పరిస్థితి లేదని ఆయన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు.

తమ స్థాయికి మించిన పదవులను కొందరు కోరుతున్న విషయాన్ని బాబు పార్టీ నాయకుల వద్ద ప్రస్తావించారు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో నామినేటేడ్ పోస్టుల భర్తీ విషయం చర్చకు వచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నామినేటేడ్ పోస్టుల భర్తీ విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఎపి లో నే ఎక్కువగా పదవులు కట్టబెట్టినట్టు ఆయన వివరించారు.అందరికీ పదవులు ఇచ్చి తృప్తి పర్చలేమని బాబు పార్టీ సమావేశంలో తేల్చి చెప్పారు.
పదవుల కోసం ఆశతో ఉన్న క్యాడర్ కు బాబు మాటలు నిరాశకు గుిచేశాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవుల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బాబు భావిస్తున్నారు.అయితే ఆయా జిల్లాల్లో పార్టీ అవసరాలను రీత్యా కూడ పదవులను కేటాయింపు ఉండనుంది.ఈ అంశాన్ని కూడ పరిగణణలోకి తీసుకోనున్నారు బాబు.












Click it and Unblock the Notifications