వైసీపీని కాపీ చేస్తూ మళ్లీ దొరికిన టీడీపీ ? ఆడుకుంటున్న నెటిజన్లు..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నం అవుతున్నాయి. అయితే అధికార వైసీపీతో పోలిస్తే ఇప్పటికే అన్ని విషయాల్లో వెనుకబడినట్లు కనిపిస్తున్న విపక్షాలు మరో విషయంలో మాత్రం ముందంజలో కనిపిస్తున్నాయి. దీంతో ప్రతీ అంశంలోనూ ఇదే విధానం అనుసరించేందుకు ప్రయత్నించి దొరికిపోతున్న పరిస్ధితి. ఇప్పటికే మ్యానిఫెస్టో, స్లోగన్లతో పాటు పలు అంశాల్లో వైసీపీని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ మరో అంశంలో ఇలాగే ప్రయత్నించి దొరికిపోయింది.
దుష్టచతుష్టయం పై పోరాడేందుకు
— YSR Congress Party (@YSRCParty) February 21, 2024
సిద్ధం. #Siddham pic.twitter.com/3mOgvA1UZM
రాష్ట్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ పదే పదే పేదలు, పెత్తందారుల యుద్ధం కాన్సెప్ట్ ను తెరపైకి తెస్తున్నారు. ఇప్పుడు దీనిపై వైఎస్సార్ సీపీ వరుస యానిమేషన్ వీడియోలు రూపొందించి నెట్లోకి వదిలిది. అయితే వీటిని వెంటనే విపక్ష టీడీపీ కాపీ కొట్టేసింది. తామూ అదే తరహాలో వీడియోలు తయారు చేసి వదిలింది. కానీ నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. టీడీపీని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనే ఏకైక ప్రచారంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ ఇప్పుడు పేదలకూ, పెత్తందారులకూ యుద్ధమంటూ వైసీపీ తెరపైకి తెస్తున్న ప్రచారంతో ఇరుకునపడుతోంది. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని సమర్ధించే పరిస్ధితి లేక, అలాగని వద్దని వ్యతిరేకించే పరిస్ధితి లేక తమ మ్యానిఫెస్టోలో అవే పథకాలకు కొనసాగింపుగా మరిన్ని తాయిలాలు ఇస్తామని చెప్పుకుంటున్న టీడీపీ.. ఇప్పుడు వైసీపీ తాజా అస్త్రంతో ఇరుకునపడుతోంది.
పేదల సంక్షేమం జెండా.. అజెండా తెలుగుదేశం పార్టీదే #YCPAntham #Shankharavam#NaraLokesh#BabuSuper6#AndhraPradesh pic.twitter.com/dHz5F0Z6Ly
— Telugu Desam Party (@JaiTDP) February 20, 2024
సంక్షేమ పథకాల విషయంలో కొత్తగా చేసేదేమీ లేక వైసీపీ మానసపుత్రికలనే పేర్లు మార్చి అమలు చేస్తామనే హామీ ఇస్తూ కాపీ క్యాట్ విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ.. ఇప్పుడు పేదలు, పెత్తందార్ల యుద్ధంపై వైసీపీ రూపొందించిన యానిమేషన్ వీడియోల్ని సైతం కాపీ కొట్టి థీమ్ మాత్రమే మార్చుకుంటోంది. దీంతో వీటిని గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలోనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.












Click it and Unblock the Notifications