Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ ఆందోళన వెనుక ? 2019 ఫలితాల నేపథ్యం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ 15 రోజులుగా అధికార వైసీపీ ఫోకస్ అంతా పోస్టల్ బ్యాలెట్లపైనే పడింది. దీనికి ప్రధాన కారణం భారీ ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే. రాష్ట్రంలో గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్ధాయిలో 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈసారి పోలయ్యాయి. సగటున చూసుకుంటే ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు 4 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇవే ఇప్పుడు వైసీపీలో గుబులు రేపుతున్నాయి.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ నిబంధనల విషయంలో గతంలో ఎలాంటి వివాదాలూ ఉండేవి కావు. కానీ ఈసారి ఈసీకి ఫిర్యాదుల నుంచి హైకోర్టు వరకూ వైసీపీ వెళ్లింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఆర్వో సంతకంతో పాటు సీల్, హోదా ఉండాల్సిన అవసరం లేదంటూ సీఈసీ స్పష్టత ఇచ్చినా వైసీపీ మాత్రం పట్టు వీడటం లేదు. ఈసీ మాత్రం ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని చెప్తోంది. ఇక్కడే ప్రతిష్టంభన నెలకొంది. హైకోర్టు దీనిపై విచారణ జరిపి కౌంటింగ్ లోపు తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

how postal ballot votes crucial for ysrcp amid tight fight trends in ap elections

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ ఇంతగా ఆందోళన చెందడం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులు తమకు అనుకూలంగా లేరనే వాస్తవం వైసీపీకి తెలుసు. అదే సమయంలో నియోజకవర్గానికి సగటున 4 వేల చొప్పున పడిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ దాదాపు 4 వేల ఓట్ల తేడాతో 15 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ సీట్లలో లేదా దాదాపు అంతకు మించిన సీట్లలో ఈసారి కూడా గట్టి పోటీ ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్లు ఫలితాల్లో కీలకంగా మారిపోయాయి.

ముఖ్యంగా విజయనగరం, నెల్లూరు రూరల్, శ్రీకాకుళం, గూడూరు, తాడికొండ వంటి స్థానాల్లో ఫలితాలను నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లలో ప్రతిబింబించే ఉద్యోగుల వ్యతిరేకత, గట్టి పోటీ జరిగిన సీట్లలో కీలకంగా మారే మెజార్టీలు ఇప్పుడు వాటిపై వైసీపీ ఆందోళన పెంచేస్తున్నాయి. అందుకే వీటిలో చాలా ఓట్లు ఏదో ఒక కారణంతో చెల్లకుండా పోతే తమకు ప్రయోజనం లభిస్తుందని వైసీపీ ఆశిస్తోంది.

ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఆర్వో సంతకం ఉండి, సీల్, హోదా లేకపోయినా ఓట్లు చెల్లుబాటు అవుతాయన్న ఉత్తర్వులు జారీ చేసిన సీఈసీ.. మరోవైపు హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం వైసీపీకి మేలు చేసేదిగా భావిస్తున్నారు. ఈసీ అఫిడవిట్ తర్వాత హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ఓట్ల లెక్కింపుకు కీలకంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+