జగన్ విశాఖకు వెళ్తే టీడీపీకి సీట్లు ఎలా పెరుగుతాయి ? లోకేష్ ఈక్వేషన్ ఇదే-సాయిరెడ్డి ఎఫెక్ట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకుంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి.అయితే ఈ లోపే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడపాలనుకుంటోంది.తద్వారా ఉత్తరాంధ్రలో పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. అలాంటి తరుణంలో జగన్ విశాఖకు తరలి వెళ్తే ఏం జరగబోతోందనే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

జగన్ విశాఖకు వెళ్తే..
మూడు రాజధానుల అమల్లో భాగంగా త్వరలో సీఎం జగన్ విశాఖకు మకాం మార్చబోతున్నారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే జగన్ విశాఖకు మకాం మార్చాలంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారింది. అయినా అసెంబ్లీ సాయంతో విశాఖకు వెళ్లేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడే క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకుని ముందుగా పాలన ప్రారంభించాలని భావిస్తున్నారు.అదే సమయంలో జగన్ విశాఖకు వెళ్తే ఏం జరుగుతుందన్న దానిపై రాష్ట్రంలో పలు చర్చలు జరుగుతున్నాయి.

లోకేష్ హాట్ కామెంట్స్
జగన్ విశాఖకు వెళ్తే ఏం జరుగుతుందన్న దానిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే విశాఖ వ్యవహారాలతో పాటు రాజధానులపైనా వైసీపీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లోకేష్.. ఇప్పుడు జగన్ విశాఖకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా చెప్పేశారు. దీనిపై వైసీపీతో పాటు టీడీపీలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో వైసీపీ హవా రాష్ట్రమంతా వీచినా వైజాగ్ లో టీడీపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకుంది. దీంతో లోకేష్ అదే విశ్వాసంతో ఇప్పుడు వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరుగుతోంది.

జగన్ విశాఖకెళ్తే టీడీపీ సీట్లు పెరుగుతాయన్న లోకేష్
జగన్ విశాఖకు వెళ్తే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో సీట్లు పెరుగుతాయని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ విశాఖకు వెళ్తే టీడీపీకి ఉత్తరాంధ్రలో ఎలా సీట్లు పెరుగుతాయన్న అంచనాకు వచ్చారన్న దానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పటికే పార్టీ నేత విజయసాయిరెడ్డి స్ధానిక వైసీపీ నేతలతో కలిసి విశాఖలో భూకబ్జాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు. ఇవే వచ్చే ఎన్నికల్లో వైసీపీపై ప్రభావం చూపుతాయని, తద్వారా టీడీపీ సీట్లు పెరుగుతాయని లోకేష్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ పై సాయిరెడ్డి ఎఫెక్ట్?
విశాఖలో సాయిరెడ్డి భూకబ్జాలు, అక్రమాల కారణంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వైసీపీకి చెడ్డపేరు వచ్చిందని టీడీపీ అంచనా వేస్తోంది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ అక్కడికి వెళితే ఆయన్ను బూచిగా చూపించి వైసీపీ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేసుకుంటోంది. అప్పుడు కచ్చితంగా ప్రజల్లో మరింత వ్యతిరేకత రావడం ఖాయంగా ఉంది. దీంతో సాయిరెడ్డి చర్యల ప్రభావం కచ్చితంగా జగన్ పై పడుతుందని, అంతిమంగా వైసీపీ నష్టపోతుందని, ఆ స్ధానంలో టీడీపీ మరిన్ని సీట్లు సాధించడం ఖాయమనే అంచనాలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications