స్వీయ జనగణన ఎలా చేసుకోవాలి ? స్వయంగా వివరాలు నమోదు చేసిన ఏపీ సీఎం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి స్వీయ జనగణన కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా సీఎం వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని ముఖ్యమంత్రికి తెలిపారు.
కాగా మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియచేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దీని కోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపోందించటం అవసరమని ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

అయితే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని మొదటి దశలో ఇవాల్టి నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందన్నారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఇండ్ల గణన( హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సరైన వివరాలను నమోదు చేయటం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రజలను కోరారు. మొత్తం ఈ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Self-Enumeration (స్వీయ లెక్కింపు) ఎలా చేసుకోవాలి?
Self-Enumeration అంటే జనగణన (Census) సమయంలో వ్యక్తులు తమ వివరాలను తాము ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం. ఇది సమయం ఆదా చేయడంతో పాటు ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది.
Self-Enumeration చేయడానికి స్టెప్స్:
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
ముందుగా జనగణన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. (భారత ప్రభుత్వ Census పోర్టల్)
2. కొత్త యూజర్‌గా రిజిస్టర్ అవ్వండి
- మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ID ఇవ్వాలి
- OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి
- ఒక యూజర్ ఐడి, పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి
3. లాగిన్ అవ్వండి
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వాలి.
4. కుటుంబ వివరాలు నమోదు చేయండి
ఇంటి అడ్రస్
కుటుంబ సభ్యుల సంఖ్య
ఇంటి రకం, సౌకర్యాలు (నీరు, విద్యుత్ మొదలైనవి)
5. వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి
ప్రతి సభ్యుడి కోసం:
పేరు, వయస్సు, లింగం
విద్య, ఉద్యోగం
వివాహ స్థితి
భాష, మతం (అవసరమైతే)
6. వివరాలు చెక్ చేసి సబ్మిట్ చేయండి
ఎంటర్ చేసిన సమాచారాన్ని ఒకసారి చెక్ చేసి, ఫైనల్‌గా సబ్మిట్ చేయాలి.
7. రిఫరెన్స్ నంబర్ సేవ్ చేసుకోండి
సబ్మిట్ చేసిన తర్వాత ఒక acknowledgment/Reference ID వస్తుంది. దీన్ని భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు.
ముఖ్యమైన సూచనలు:
తప్పు సమాచారం ఇవ్వకూడదు
ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం కష్టం కావచ్చు
సురక్షితమైన నెట్‌వర్క్ ఉపయోగించాలి












Click it and Unblock the Notifications