VV Lakshminarayana: టీడీపీ, వైసీపీ పెంచి పోషించిన జేడీ- టికెట్ మాత్రం నో! కొత్త పార్టీ వెనుక?

ఏపీలో జేడీగా సుపరిచితులైన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ నిన్న జై భారత్ పేరుతో విజయవాడలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. రాజకీయాల్లో సమూలంగా మార్పులు తెస్తానని, యువతకు చోటిస్తామని పలు హామీలు కూడా ఇస్తున్నారు. రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఆవిర్భావం రాజకీయాల్ని ఏ మలుపులు తిప్పుతుందన్న చర్చ ఓవైపు జరుగుతుండగా.. అసలు ఈ నిర్ణయానికి వెనుక ఏముందనే మరో చర్చకూడా జరుగుతోంది.

2010లో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాల్లో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్ మరణించాక ఆయన స్ధానంలో రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించిన తర్వాత తమను ధిక్కరించిన ఆయన తనయుడు వైఎస్ జగన్ ను కట్టడి చేసేందుకు సీబీఐ కేసుల్ని మోపింది. దీంతో అప్పటికే ముంబై ఏటీఎస్ లో జేడీ హోదాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తొలిసారిగా సీబీఐ జేడీ హోదాలో ఈ కేసుల దర్యాప్తులో తెరపైకి వచ్చారు.

how vv lakshminarayana grows from cbi joint director to political party with tdp, ysrcp support?

ఓవైపు కేంద్రం ఆదేశాల మేరకు అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తూనే మరోవైపు ఆ వివరాలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేస్తూ వచ్చారు. ఈ వివరాలు వాడుకుని ఆయా మీడియా సంస్ధలు చెలరేగిపోయేవి. అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణను ఆయా మీడియా సంస్దలు బహిరంగంగానే ఆకాశానికెత్తేసేవి. ఆ తర్వాత జగన్ కు బెయిల్ రావడం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో పరిణామాలు మారిపోయాయి. దీంతోపాటే జేడీ లక్ష్మీనారాయణ హవా కూడా తగ్గిపోయింది.

ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. జేడీ లక్ష్మీనారాయణకు మీడియాలో మాత్రం ప్రాధాన్యం కొనసాగింది. జగన్ కేసుల దర్యాప్తు సమయంలో జేడీ లక్ష్మీనారాయణను మీడియాతో పాటు ఆకాశానికెత్తేసిన టీడీపీ రాజకీయంగానూ తనకు అవకాశమిస్తుందని ఆశించిన జేడీ తన పదవికి వీఆర్ఎస్ ప్రకటించి బయటికి వచ్చేశారు. కానీ అవకాశం దక్కకపోవడంతో కాసేపు పొలాల్లో రైతులతో కలిసి పనులు చేసుకోవడం, మరికాసేపు కాలేజీలకు వెళ్లి విద్యార్ధులతో చర్చలు చేసుకునేవారు. అలా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరి వైజాగ్ టికెట్ దక్కించుకున్నా జనం మాత్రం ఆదరించలేదు.

అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీవైపు లక్ష్మీనారాయణ మొగ్గడం ప్రారంభించారు. వైసీపీ మూడు రాజధానుల్ని, నాడు-నేడును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం తో వైసీపీ అనుకూల మీడియాలో ఆయన ప్రతీ వార్తా కనిపించేది. దీంతో జేడీ వైసీపీలో చేరిపోతారని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పార్టీలో చేరితే తాము అనుకున్న అవకాశం ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ ఆయన కోరుకుంటున్న వైజాగ్ ఎంపీ సీటు మాత్రం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. దీంతో చేసేది లేక తానే ఓ కొత్త పార్టీ పెట్టేశారు. అలా టీడీపీ, వైసీపీ రెండూ జేడీని పెంచి పోషించినా టికెట్ మాత్రం ఇవ్వకపోవడంతో కొత్త పార్టీ పెట్టి పోరుకు లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+