వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''ఎన్ని సీట్లకు పోటీ చేస్తామో చెప్పలేం, ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు''

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. 2018 చివరినాటికి తమ పార్టీ ఎన్ని సీట్లలో పోటీచేస్తోందనే విషయమై స్పష్టత వస్తోందన్నారు పవన్‌కళ్యాణ్.

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలకు పూర్తి కాలం కేటాయించనున్నారు. మరో నెల రోజుల్లోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి కాలాన్ని కేటాయించనున్నారు.

తాను ఒప్పందం కుదుర్చుకొన్న సినిమాలను పూర్తిచేసే పనిలో పవన్‌కళ్యాణ్ ఉన్నారు. అయితే పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు జనసేన వ్యూహలను రచిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. ఇతర పార్టీలకు జనసేనకు మధ్య తేడాను ప్రజలకు చూపాలనే ఉద్దేశ్యాన్ని పవన్‌కళ్యాణ్ తాపత్రయపడుతున్నారు.

2019 ఎన్నికల్లో ఎన్నిసీట్లకు పోటీ చేస్తానో చెప్పలేను

2019 ఎన్నికల్లో ఎన్నిసీట్లకు పోటీ చేస్తానో చెప్పలేను

2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీచేసే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేనని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.జనసేన పట్ల ప్రజలు ఏ రకంగా స్పందిస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అయితే 2018 చివరినాటికి తమ పార్టీపై ఒక అంచనాకు రానున్నట్టు పవన్ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ప్రకారంగానే 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు.

పిఆర్‌పి ఫెయిలయ్యాక నిరూపించుకోవాల్సింది

పిఆర్‌పి ఫెయిలయ్యాక నిరూపించుకోవాల్సింది

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ రాజకీయాలను ఆషామాషీగా చూడడం లేదు. ప్రజారాజ్యం పార్టీ ఫెయియ్యాక ప్రతిదాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు పవన్‌కళ్యాణ్. అయితే పిఆర్‌పి ఫెయిలైన తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

సీట్లు గెలవడమే ముఖ్యమే కాదు

సీట్లు గెలవడమే ముఖ్యమే కాదు

ప్రజా సేవ చేయడమంటే సీట్లు గెలవడమే కాదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమన్నారు పవన్‌కళ్యాణ్.25 ఏళ్ళపాటు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ చెప్పారు.

శతఘ్ని పేరుతో సోషల్ మీడియా టీమ్

శతఘ్ని పేరుతో సోషల్ మీడియా టీమ్


సోషల్ మీడియా త్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ కావాలని పవన్‌కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శతఘ్ని పేరుతో డిజిటల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల వద్దకు పార్టీని తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు.

ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు

ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు


తాను ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. బాషకు , ప్రాంతానికి పరిమితం కాలేదని పవన్ చెప్పారు. పిఆర్‌పి ఎన్నికల ప్రచార సమయంలో తాను ఎక్కువగా తెలంగాణ జిల్లాల్లో పర్యటించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. హైద్రాబాద్‌లో ఉన్న నెట్‌వర్క్ జిల్లాల్లో లేదన్నారు. సమస్య ఎక్కడైనా ఉంటే తెలంగాణలో కూడ పర్యటించేందుకు సిద్దమన్నారు.నేను తెలంగాణలోనే ఎక్కువగా పర్యటించాను

రాయలసీమ కరువును పాలకులు సృష్టించింది

రాయలసీమ కరువును పాలకులు సృష్టించింది

రాయలసీమ కరువును నాయకులు సృష్టించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి వస్తే పోలిటికల్ స్పేస్ కోసం వచ్చినట్టు చెబుతారని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ లబ్ది కోసం చేయకూడదన్నారు. హోదా ఇవ్వకుంటే స్పష్టం చేయాలన్నారు.

English summary
Howmany seats to contest in 2019 elections I will reveal in 2018 said Janasena chief Pawan kalyan.He explained party view on various issues to cadre.Pawan kalyan meeting with party leaders on Friday at hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X