అమరరాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

చిత్తూరు: జిల్లాలోని యాదమర్రి మండలం మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని టీబీడీ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ప్లాంట్‌లో దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. నాలుగు ఫైరింజిన్లతో మంటలను ఆర్పివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 huge fire accident at amara raja battery plant in chittoor district

కాగా, ప్రమాదం సంభవించిన వెంటనే కార్మికులందరినీ సురక్షితంగా బయటకు పంపినట్లు అమరరాజా బ్యాటరీ పరిశ్రమ యాజామాన్యం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+