ఏపీకి భారీ పెట్టుబడులు..రాష్ట్రంలో రేమాండ్ ప్రాజెక్ట్ లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచం దృష్టి ఆంధ్రప్రదేశ్ పై పడేలా సీఎం చంద్రబాబు తో పాటు, నారా లోకేష్ సీరియస్ గా ఫోకస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, మంత్రుల సమక్షంలో అనేక పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.

పెట్టుబడులే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు గ్రీన్ ఎనర్జీ రంగంలో 2.20లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలతో పాటు, అనేక కీలక ప్రాజెక్టులపైన ఒప్పందాలు చేసుకున్నారు. చంద్రబాబు నిన్న భాగస్వామ్య సదస్సులో రూ. 8.26లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు, వీటి ద్వారా 12.05లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. మొత్తం 400 ఎంఓయూల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు లక్ష్యంగా ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.

Huge investments in AP CM Chandrababu lays foundation for Raymond projects worth Rs 1 201 cr

ఏపీలో 1,201 కోట్ల పెట్టుబడులతో మూడు ప్రాజెక్ట్ లు
ఇక నేడు సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‍గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‍మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ లు పాల్గొన్నారు. రూ.1,201 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది.

రేమాండ్ గ్రూప్ ప్రాజెక్ట్ లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్‍కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ లతో 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు
అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను రేమాండ్ గ్రూప్ స్థాపించనుంది. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు, వేలాది మందికి పరోక్షంగా దీని ద్వారా ఉపాధిని కల్పించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+