విద్యుత్ వినియోగదారులకు ఊరట - ట్రూఅప్ ఛార్జీలు వెనక్కు : ఈ నెల బిల్లుల్లో సర్దుబాటు..!!
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారీగా చేసిన వసూళ్ల పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వినియోగదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, ఇప్పుడు ఈ వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించటానికి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం అయింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి.

వసూలు చేసిన మొత్తం వెనక్కు
డిసెంబర్ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లుల్లో తగ్గించి ఇస్తుండటంతో...దీని పైన వినియోగదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 2014-15 నుంచి 2018-19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది.

మొత్తం రూ.196.28 కోట్ల మేర ఊరట
ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్‌సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి.

ప్రస్తుత బిల్లుల్లో సర్దుబాటు
ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోకి వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది.
Recommended Video

ట్రూఅప్ చార్జీలు
దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. ఈ నిర్ణయం తో రాష్ట్రంలోని కోటి 86 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఊరట లభించనుంది.
-
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
Amaravati: అమరావతికి కేంద్రం మరో గిఫ్ట్-బిల్లు ఆమోదించిన 24 గంటల్లో..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్!












Click it and Unblock the Notifications