ఇంద్రకీలాద్రిపై భక్తులకు ప్రోటోకాల్ కష్టాలు - చేతులెత్తేసారు..!!

అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలి వచ్చారు. క్యూ లైన్ల నిర్వహణలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రోటోకాల్ లో అధికారుల తీరు పైన రాజకీయ పార్టీల విమర్శలకు కారణమవుతున్నాయి. వైసీపీ నేతలకు ప్రోటోకాల్ దర్శనం వివాదాస్పదమైంది.

భక్తుల రద్దీ
విజయవాడ ఇంద్రకీలాద్రి పైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మవారి దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. కొండపై భాగం నుంచి కొండ కింద వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దుర్గగుడిపై నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికారులు నడుచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Huge rush was seen at the Indrakeeladri temple Devotees angry over Temple officials

పట్టించుకోని అధికారులు
రూ. 500ల టికెట్లు కొన్న భక్తులు కూడా దుర్గమ్మను దర్శించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. గంటల కొద్ది భక్తులు పడి గాపులతో క్యూ లైన్లు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు తీసుకునే అంతరాలయ దర్శనం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు, దుర్గగుడి సిబ్బంది పోటాపోటీగా దర్శనాలు చేయిస్తున్నారని భక్తులు అంటున్నారు. దర్శనం చేయించడంలో పోలీసులకు, ఆలయ సిబ్బందికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. నవరాత్రుల ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు.

ప్రోటోకాల్ రగడ
అనధికారికంగా అంతరాలయ దర్శనాలు కొనసాగుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు. రాష్ట్ర మంత్రులు వస్తే కనీసం స్వాగతం పలకని ఈవో.. వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు రాచ మర్యాదలు చేయడంపై జనసేన, టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+