వైసీపీకి బిగ్ షాక్.. పంచుమర్తి అనురాధా గెలుపు..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధా విజయం సాధించారు. వైసీపీ ఆరు సీట్లకే పరిమితమైంది. ఊహించని విధంగా అధికార వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా... నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో ఆ సంఖ్య 19కి పడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 22 ఓట్లు కావాలి.
వైసీపీ నాయకత్వంతో విబేధించిన ఆనం రాంనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓటింగ్ చేసినట్లు స్పష్టం అవుతోంది. వీరితో పాటుగా మరో రెండు ఓట్లు టీడీపీకి అదనంగా పోలయ్యాయి. దీంతో ఒక ఓటు తక్కువగా ఉన్న అనురాధా అదనంగా మరో ఓటు సాధించి తొలి విజేతగా నిలిచారు.
అయితే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.

అనురాధా గెలుపుతో వైసీపీ నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి ఓటమి ఖాయమైంది. అనురాధకు ఆనం, కోటం రెడ్డితో పాటుగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఒక మాజీ సీనియర్ నేత పేరు బలంగా వినిపిస్తోంది. ఈయనతో పాటు వైసీపీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది.ఈ ఎన్నికల్లో తొలి నుంచి సీఎం జగన్, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు కూడా ప్రచారం సాగుతుంది. ముందునుంచి కూడా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామన్న వైసీపీకి ఇది భారీ షాక్‌గా మారింది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఫలితాలు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఫలితాలతో వైసీపీ ఒక విధంగా ఆత్మరక్షణలో పడింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీకి ఈ ఫలితం బూస్టప్‌గా మారింది.












Click it and Unblock the Notifications