వైసీపీ లీడర్స్ తో పోటీ పడిన వీఆర్వోలు, ప్రభుత్వ భూములు స్వాహా, ఫ్యామిలీలో ఎందరుంటే ?
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కోసం పని చెయ్యకుండా వైసీపీ నాయకుల కోసం పని చేసిన వందల మంది వీఆర్వోలు స్వామి భక్తిని చాటుకున్నారని వెలుగు చూసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పని చేస్తున్న కొందరు వీఆర్వోలు వైసీపీ నాయకులు చెప్పిన వారికి గుట్టుగా వందల ఎకరాల ప్రభుత్వ భూములు రాసిచ్చేశారని వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ చేపడుతామని మంత్రి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొన్ని జిల్లాలో వైసీపీ నాయకులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 900కు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయం గ్రేడ్ 2 వీఆర్వోలు, వీఆర్ఏలు కలిపి మొత్తం 1,169 మంది విధులు నిర్వహించారు. అక్కడే వీఆర్వోలు అసలు కథ నడిపారని వెలుగు చూసింది.

కర్నూలు జిల్లాలోని కల్లూరులో కొందరు వీఆర్వోలు అక్రమాలకు తెరలేపారని తెలిసింది. ఇదే అదునుగా బావించిన మరికొందరు వీఆర్వోలు మేము ఏం తక్కువ తిన్నాము అంటూ చేతివాటం చూపించారని తెలిసింది. రెవెన్యూ శాఖలో పని చేస్తుండటంతో అక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వివాదాస్పద లిటికేషన్ భూములు ఉన్నాయని అని పూర్తి సమాచారం సేకరించిన కొందరు వీఆర్వోలు ఆ పూర్తి వివరాలు, భూముల సర్వే నెంబర్ల జాబితాను స్థానిక వైసీపీ నాయకుల చేతిలో పెట్టారని తెలిసింది.
ప్రభుత్వ పోరంబోకు భూముు, వాగులు, వంకలు, రస్తా పోరంబోకు భూములు, పార్కు స్థలాలు సమాచారం సేకరించిన వీర్వోలు ఓ జాబితాను సిద్దం చేశారని తెలిసింది. గతంలో అక్కడ పని చేసిన తహసిల్దార్లతో పని చేసిన అనుభవం, వారితో ఉన్న చనువుతో పాత తేదీలలో భూములు కేటాయించారని నకిలి రికార్డులు తయారు చేసి వాటిని తహసిల్దార్ కార్యాలయాల్లోని రికార్డు మధ్య భద్రపరిచారని తెలిసింది. ఇలా వందల ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు, వీఆర్వోలు నొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల కాలంలో రిటైడ్ అయిన ఓ వీఆర్వో ఆయన అనుభవంతో పాటు వైసీపీ నాయకులతో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వందల ఎకరాల భూములను రిజిస్టర్ చేయించారని వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలోని కొమిగండల్ల మండలంలోని వందల ఎకరాల భూములను రిటైడ్ వీఆర్వో కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ అయ్యిందని, ఈ విషయంపై విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇటీవల మీడియా ముందు చెప్పారంటే ఆ విషయం ఎంత సీరియస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకో వీఆర్వో వైసీపీ నాయకు అండదండలతో కోట్లాది రూపాయల అక్రమాస్తులు సంపాధించాడని, ఆ డబ్బులతో బహుళ అంతస్తుల భవనం నర్మిస్తున్నాడని ఇటీవల కొందరు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కొందరు వీఆర్వోలు అయితే వైసీపీ నాయకులతో పోటీ పడి మరి అక్రమాస్తులు సంపాధించారని, ప్రభుత్వ భూములు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వీఆర్వోలు భారీ అక్రమాలకు పాల్పడ్డారని వెలుగు చూడటంతో ఆ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.












Click it and Unblock the Notifications