Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తకు షాకిచ్చి ప్రియుడితో సహజీవనం ... రగిలిపోయిన భర్త ఏం చేశాడంటే ..

కట్టుకున్న మొగుడిని కాదని ఓ ఇల్లాలు ప్రియుడితో సహజీవనం చేయటం మొదలుపెట్టింది . ఆ విషయం తెలిసి రగిలిపోయిన భర్త ఊహించని ఘోరానికి ఒడిగట్టాడు. తన భార్య పై, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో విరుచుకుపడ్డాడు. విచక్షణ మరచి దారుణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాల్లోకి వెళితే

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోనెగండ్ల మండల కేంద్రంలో నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొంతకాలంగా బజారి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. భార్యను మార్చడానికి భర్త ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. ఇక తనను కాదని వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వారిద్దరిపై కోపం పెంచుకున్న నాగరాజు ఎలాగైనా వారిద్దరిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భార్యపై, ఆమె ప్రియుడిపై కత్తి బండరాళ్లతో దాడి చేశాడు.

Husband attacks on wife and his lover with knife and stones, lover died

ఈ ఘటనలో భార్య ప్రియుడు బజారి మృతిచెందగా,భార్య ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇరువురిపై దాడి చేసి పారిపోయిన నాగరాజు కోసం కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+