విడివిడిగా దంపతులు: భార్యపై భర్త యాసిడ్ దాడి

తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూర్ క్రాస్‌లో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జరీనాబేగం తన భర్త ఖాజావలితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడేళ్లుగా విడిగా ఉంటోంది.

ఖాజావలి తరచూ భార్యను ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేసేవాడు. గతంలో ఈ విషయంలో గొడవ పడి కత్తితో దాడి చేసి జరీనాను గాయపరిచాడు. అతడిపై కేసు కూడా నమోదయింది. ఈ నేపథ్యంలోనే కాలూరు క్రాస్ రోడ్ మీదుగా ఇంటికి వెళ్తున్న జరీనాపై ఖాజావలి యాసిడితో ఆమెపై దాడి చేశాడు.

ఈ దాడిలో జరీనా తలకు, ముఖానికి గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జరీనా బేగం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Husband attacks with acid on his wife in Chittoor district

భార్య ఉద్యోగం మానేయకపోవడంతో ఖాజావలి కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆమె రెండు కళ్లకు ప్రమాదం ఉన్నట్లు సమాచారం.

వ్యక్తి దారుణ హత్య

ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని కొత్తపాలెం దగ్గర ఘోరమైన హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసి నోటికి ప్లాస్టర్ వేసి కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+