పిడుగు పడి భర్త మృతి....భార్యకు తీవ్రగాయాలు
కర్నూల్ జిల్లాఎమ్మిగనూరు మండలం,టీఎస్.కొల్లూరులో పిడుగు పడి విషాదం చోటుచేసుకుంది. స్థానికం గా తమ పొలం లో పొలం పనులు చేసుకుంటున్న భార్య, భర్తలు వర్షం వచ్చే సూచనలు గ్రహించారు.
కర్నూలు: కర్నూల్ జిల్లాఎమ్మిగనూరు మండలం,టీఎస్.కొల్లూరులో పిడుగు పడి విషాదం చోటుచేసుకుంది. స్థానికం గా తమ పొలం లో పొలం పనులు చేసుకుంటున్న భార్య, భర్తలు వర్షం వచ్చే సూచనలు గ్రహించారు. ఇద్దరూ పొలం పనిలో ఉండగా ఉరుములు మెరుపులతో సన్న జల్లులు ఆరంభమయ్యాయి.
దీనితో భార్య, భర్తలిద్దరు స్థానికం గా తలదాచుకొనేందుకు ఓ చెట్టు క్రిందకు చేరారు. ఈ క్రమంలో పిడుగుపడి భర్త మృతి చెందాడు. మృతుడు స్థానిక కనకవీడు గ్రామస్తుడిగా స్థానికులు గుర్తించారు.పక్కనే ఉన్న భార్యకు తీవ్రగాయాలు అయ్యి ఒళ్ళు కాలిపోయింది.

ఎదిగే నరసింహులు అక్కడికక్కడే చనిపోగా , భార్య లక్ష్మి ని స్థానికులు గ్రహించి ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. జరిగిన ఘటనతో కనకవీడు గ్రామం లో బందువులు విషాదం లో ఉన్నారు.












Click it and Unblock the Notifications