ఎండ్రకాయల కూర చేయలేదని భార్యను చంపిన భర్త

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: తనకు నచ్చిన కూర చేయలేదనే కోపంతో ఓ భర్త భార్యను చంపేశాడు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రామేశ్వరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, గంగమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

వారందరికీ పెళ్లిలు అయ్యాయి. ఆదివారం చేపల కోసం వెళ్లిన వెంకటేశ్వర్లు ఎండ్రకాయలు తెచ్చి పొలం వద్ద భార్యకు ఇచ్చి కూర చేసి తీసుకు రావాలని చెప్పాడు. ఇంటికి వెళ్లిన గంగమ్మ ఎండ్రకాయలు మరో రోజుకి ఉంచేసి, కోడిగుడ్ల కూర చేసి భర్తకు తీసుకువెళ్లింది.

Husband kills wife for not making curry with crabs

కోడి కూర చూసి మండిపడిన వెంకటేశ్వర్లు ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.దాంతో అక్కడే ఉ్న గడ్డపారతో భార్యను పొడిచి చంపాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన కూతురువెంకటమ్మతో విషయం చెప్పేసి పారిపోయాడు.

వెంకటేశ్వర్లు కుటుంబానికి గ్రామ సమీపంలో 5 ఎకరాల భూమి ఉంది. భార్య వచ్చేసరికి తాగిన మత్తులో ఉన్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband Venkateswarlu killed his wife for not making curry with crabs at Porumamillain Kadapa district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి