వివాహేతర సంబంధానికి అడ్డు అనే హత్య: భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భార్యనే ఓ భర్త చంపేసి ఇంటి వెనుకాల పాతిపెట్టిన సంఘటనలో పోలీసులు నిందితుడు దుర్గా ప్రసాద్, అతని ప్రియురాలి లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే భార్య ప్రాణాలు తీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వాంబే కాలనీలో జరిగిన ఈ సంఘటన నెల రోజుల తర్వాత వెలుగు చూసింది. పోలీసులు నిందితులు దుర్గాప్రసాద్, ప్రియురాలు లక్ష్మిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

భర్త ఉండగానే మరొకరితో భార్య: చంపి, ఇంట్లోనే పాతిపెట్టాడు

అజిత్‌సింగ్ నగర్‌ వాంబే కాలనీకి చెందిన ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్న దుర్గాప్రసాద్‌కు, అదే ప్రాంతానికి చెందిన మరియమ్మతో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Husband, lover arrested in wife murder case

భర్త దుర్గాప్రసాద్ ఇటీవలి కాలంలో రాధానగర్‌కు చెందిన లక్ష్మితో అక్రమ సంబంధం కొనసాగించి, గుడివాడకు మకాం మార్చాడు. విషయం తెలుసుకున్న భార్య మరియమ్మ అతన్ని, గుడివాడ నుంచి విజయవాడ వాంబే కాలనీకి రప్పించింది.

ఇక నుంచి లక్ష్మితో వెళ్లనని చెప్పాడు. ఆ తర్వాత మరియమ్మను పథకం ప్రకారమే హత్య చేయాలనుకున్నాడు. గత నెల 14వ తేదీ రాత్రి ఇంట్లో ఉన్న మరియమ్మతో ఘర్షణ పడి, ఆమె తీవ్రంగా కొట్టి, ఆపై రిబ్బన్‌తో మెడపై బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

వెంటనే ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో గొయ్యి తీసి పాతి పెట్టాడు. అనంతరం పిల్లలతో ప్రియురాలు లక్ష్మి వద్దకు వెళ్లాడు. మృతురాలి తల్లి తన కూతురు గురించి పలుమార్లు అడిగింది. ఆయన ఏదో సమాధానం చెప్పేవాడు.

చివరకు ఆ తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడిపై అనుమానం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband, lover arrested in wife murder case Vijayawada.
Please Wait while comments are loading...